
CNG dual Cylinder Car : డ్యూయల్ సీ.ఎన్.జీ సిలిండర్ తో హుండాయ్ ఎక్స్ టర్... ఫ్యూచర్స్ అదుర్స్...!
CNG dual Cylinder Car : ప్రస్తుత కాలంలో చాలామందికి సొంతంగా కారు కొనాలనే ఆశ ఉంటుంది. అయితే దీనిలో కొందరు పెట్రోల్ వేరియంట్ కారుని తీసుకుంటుంటే మరికొందరు డీజిల్ వేరియంట్ కారును కొనుగోలు చేస్తున్నారు.ఇక ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్స్ కూడా అందుబాటులో ఉండడంతో మరికొందరు ఎలక్ట్రిక్ కారు కొనేందుకు ఆసక్తి చూపుతుంటే మరికొందరు ప్రత్యామ్నాయంగా ఆలోచించి సిఎన్ జీ కార్లను కొనుగోలు చేస్తున్నారు . అయితే సిఎన్ జీ కార్లకు పెట్రోల్ కార్లు కంటే ఇంధనం తక్కువ అవసరం ఉంటుంది. అలాగే ఎక్కువ మైలేజ్ వస్తాయి. అంతేకాక లాంగ్ డ్రైవ్ చేయాలి అనుకునే వారికి ఇటీవల వచ్చిన సిఎన్ జీ కార్లు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా సిఎన్ జీ కార్ల ఉత్పత్తిపై ప్రాధాన్యత చూపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు మార్కెట్ లో వచ్చిన కార్లలో ఒక్క సీఎన్ జీ సిలిండర్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు డ్యూయల్ సిలిండర్ కలిగిన కార్లు కూడా వచ్చాయంటే నమ్ముతారా…?
సాధారణంగా అయితే ఒక కారులో పెట్రోల్ తో పాటు ఒక సిఎన్ జీ సిలిండర్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీంతో లాంగ్ డ్రైవ్ చేయాలి అనుకునేవారు వారి యొక్క లగేజ్ ను స్టోర్ చేసుకునేందుకు ఇబ్బంది పడేవారు. కానీ ప్రస్తుతం వినియోగదారుల యొక్క సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని TATA పంచ్ మార్కెట్లో మొదటిసారిగా డ్యూయల్ సిఎన్ జీ సిలిండర్ కారును అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అయితే ఈ కారుకు పోటీగా ఇప్పుడు హుండాయ్ కూడా డ్యూయల్ సిలిండర్ కార్లను మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. దీంతో ప్రస్తుతం దేశీయ మార్కెట్లో హుండాయ్ కార్లు శర వేగంగా దూసుకుపోతున్నాయి. అయితే ఎస్ యు వి కార్లను తీసుకురావడంలో హుండాయ్ ఎప్పుడు ముందంజలో ఉంటుంది. ఈ క్రమంలోనే ఇదివరకే విడుదల చేసిన హుండాయ్ ఎక్స్ టర్ ను డ్యూయల్ సిలిండర్ తో అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఇది ఇప్పటికే ఎలక్ట్రిక్ ఆప్షన్ తో పాటు సిఎన్ జీ వేరియంట్ లో కూడా రావడం జరిగింది. ఇక ఇప్పుడు డ్యూయల్ సిలిండర్ తో రావడంతో మార్కెట్లో టాటా కంపెనీకి చెందిన పంచ్ డ్యూయల్ సిలిండర్తో ఎక్స్ టర్ పోటీ ఇవ్వనుంది.
CNG dual Cylinder Car : డ్యూయల్ సీ.ఎన్.జీ సిలిండర్ తో హుండాయ్ ఎక్స్ టర్… ఫ్యూచర్స్ అదుర్స్…!
ఇక ఎక్స్ టర్ ఇంజన్ విషయానికి వచ్చినట్లయితే 1.2 లీటర్ పెట్రోల్ తో పాటు సిఎన్ జీ వేరియేషన్ తో అందుబాటులో ఉంది. ఇక దీనిలో సిఎన్ జీ ఆప్షన్ 27.1 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అంటే పెట్రోల్ పై 19.2 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఇక ఎక్స్ టర్ కు ఉన్న సేఫ్టీ ఫీచర్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయని చెప్పాలి. ఎందుకంటే దీనిలో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. దీనితోపాటు ఎలక్ట్రిక్ సన్ రూఫ్ , ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ , 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ , వైర్లెస్ చార్జర్ , స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ , డ్యూయల్ కెమెరా , ఫుట్వేల్ లైటింగ్ , పాడిల్ ఫిస్టర్ వంటి ఫ్యూచర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో హుండాయ్ ఎక్స్ టర్ యొక్క ధర రూ.5.99 లక్షల నుండి అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం పెట్రోల్ తో పాటు సిఎన్ జీ కారు కావాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.