Whatsapp Loan : వాట్సప్ ద్వారా రూ.10 లక్షల లోన్.. ఇలా పొందండి
Whatsapp Loan : ఎట్టెట్టా.. వాట్సప్ నుంచి రూ.10 లక్షల లోన్ ఇస్తారా? అదెలా సాధ్యం అంటారా? వాట్సప్ నుంచి కేవలం మెసేజ్ లు పంపించుకోవచ్చని తెలుసు కానీ.. ఇలా లోన్ కూడా ఇస్తారా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే.. నిజమే వాట్సప్ నుంచి లోన్స్ కూడా తీసుకోవచ్చు. అది కూడా క్షణాల్లో. వినటానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఎందుకంటే.. వాట్సప్ కు దేశవ్యాప్తంగా 45 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. అందులో చాలామందికి ఫైనాన్సియల్ గా అవసరం చాలా ఉంటుంది.
వాళ్లను టార్గెట్ చేసుకొని వాళ్ల అవసరాలను తీర్చడం కోసం వాట్సప్ తీసుకొచ్చిన కొత్త ఐడియా ఇది.ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ సంస్థ ఈ లోన్స్ ఇస్తోంది. ఐఐఎఫ్ఎల్ సంస్థ వాట్సప్ కంపెనీ మెటాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఐఐఎఫ్ఎల్ దేశంలోనే అతిపెద్ద నాన్ బ్యాంకింగ్ సంస్థ. ఇది హోమ్ లోన్స్, గోల్డ్ లోన్స్ లాంటి పలు రకాల లోన్స్ ఇస్తుంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లకు లోన్స్ ఇవ్వడం కోసం వాట్సప్ తో టైఅప్ అయింది.
Whatsapp Loan : లోన్ కావాలంటే ఇలా చేయండి
లోన్ కావాలని అనుకున్న వాళ్లు మీ వాట్సప్ లో 9019702184 అనే నెంబర్ కు మెసేజ్ చేయండి. హాయ్ అని మెసేజ్ పెడితే ఐఐఎఫ్ఎల్ మీకు సంబంధించిన కొన్ని వివరాలు అడుగుతుంది. పేరు, ఆధార్ కార్డు, పాన్ కార్డు లాంటి వివరాలు వాట్సప్ ద్వారానే పంపించాల్సి ఉంటుంది. వెంటనే వెరిఫై చేసుకొని మీకు సాంక్షన్ అయిన ఎమౌంట్ ను మీ అకౌంట్ లో క్రెడిట్ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే వాట్సప్ నుంచి లోన్ తీసుకొని మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోండి.