BSNL : ఇన్నాళ్లు టెలికాం రంగాన్ని ఓ ఊపు ఊపిన జియోకి ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తుంది. ఈ సంస్థ పలు మార్పులు చేర్పులు చేస్తూ వినియోగదారులని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. తక్కువ ధరకే సర్వీసులు అందుబాటులో ఉండడం సహా త్వరలో 4జీ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తారనే వార్తలతో అనేక మంది బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా బీఎస్ఎన్ఎల్‌కి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేసింది.
భారత సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఓ వైపు 4జీ సేవలను ప్రారంభిస్తూనే… మరోవైపు 5జీపైనా కూడా సన్నాహాలు చేస్తోంది. తాజాగా టెస్టింగ్ దశలో ఉన్న బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వర్క్‌ను కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా పరీక్షించారు.సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ-డీఓటీ) క్యాంపస్‌లో 5జీ ద్వారా వీడియో కాల్ మాట్లాడారు. ఈ వీడియోను తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ‘కనెక్టింగ్ ఇండియా’ అనే లైన్‌తో ఈ వీడియోను షేర్ చేశారు. వీడియోలో తాను కనిపిస్తున్నానా మరియు తన మాటలు వినిపిస్తున్నాయా అని ప్రశ్నించడాన్ని వీడియోలో గమనించవచ్చు. ఈ ప్రశ్నలకు సదరు మహిళ కూడా సమాధానం చెప్పారు. మాటలు స్పష్టంగా ఉన్నాయని చెప్పడం వీడియోలో గమనించవచ్చు. అనంతరం మంత్రి పక్కన ఉన్న అధికారి బీఎస్ఎన్ఎల్ 5జీ అంటూ మాట్లాడడం వినిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కాగా, ఈ ఏడాది చివరిలోగా దేశంలోని చాలా ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రైవేటు టెలికాం సంస్థలన్నీ ఇప్పటికే 5జీ నెట్ వర్క్ ను ప్రారంభించి, విస్తరిస్తుండగా… ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ఇన్నాళ్లకు 4జీ సేవలు అందుబాటులోకి తీసుకురావడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 30 రోజుల్లో 2 లక్షలకు పైగా కొత్త సిమ్ కార్డులు యాక్టివేట్ అయినట్లు వెల్లడించించింది. దేశవ్యాప్తంగా ఇతర సర్కిళ్లలోనూ వినియోగదారుల సంఖ్య పెరుగుతోందని తెలుస్తోంది.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.