Komaki LY Pro : ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో కొత్త కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి వస్తున్నాయి. తాజాగా కొత్త కోమకి ఎల్ వై ప్రో స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. ఈ స్కూటర్ ఎక్స్ షోరూం ధర 1,37,500 ఉంది. కంపెనీ ఇందులో డ్యూయల్ బ్యాటరీలను అమర్చింది. డ్యూయల్ చార్జర్ తో వీటిని ఛార్జ్ చేసుకోవచ్చు. దాదాపుగా 5 గంటల్లో బ్యాటరీలు ఫుల్ అవుతాయి. ఈ కొత్త స్కూటర్ లో టీఎఫ్ టి డిస్ప్లే ఉంది.
ఆన్‌బోర్డు నావిగేషన్, సౌండ్ సిస్టమ్, బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్స్ వంటివి ఉన్నాయి. అలాగే ఈ స్కూటర్లో మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఈ స్కూటర్ గంటకు 62 కిలోమీటర్లు వరకు వెళుతుంది. ఈ స్కూటర్లో యాంటీస్నిడి టెక్నాలజీ ఉంది. హిల్స్ పై ఈ స్కూటర్ స్కిడ్ కాకుండా ఉంటుంది. అలాగే 12 ఇంచుల ట్యూబ్ లెస్ టైర్లు ఉన్నాయి.స్కూటర్‌లో 3000 వాట్ హబ్ మోటార్ ఉంది. 38 ఏఎంపీ కంట్రోలర్స్ ఉన్నాయి. పార్కింగ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్ ఫంక్షన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఎల్ఈడీ లైట్స్, అలాయ్ వీల్స్, టెలీ స్కోపిక్ ఫ్రంట్ సన్సెన్షన్, డ్యూయెల్ డిస్క్ బ్రేక్స్, రిమోట్ కీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 160 కి.మీ నుంచి 180 కి.మీ వరకు వెళుతుంది.ఓలా ఎస్1, ఏథర్ 450 ప్లస్ జెన్ 3, టీవీఎస్ ఐక్యూబ్ వంటి మోడళ్లకు ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గట్టి పోటీ ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక మార్కెట్లో చాలా స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ధరను బట్టి రేంజ్, ఫీచర్లు మారుతాయి. 70 వేల నుంచి కూడా మంచి స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.