new Electric Scooter features
Electric Scooter : ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల,Electric Scooter, హవా నడుస్తుంది. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరిగింది. అందుకే చాలా కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు పోటీ పడుతున్నాయి. దేశీయంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి కంపెనీలు పోటీ పడుతున్నాయి. తాజాగా చైనాకు చెందిన లోన్సిన్ మోటార్ సైకిల్స్ కంపెనీ కూడా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ని లాంచ్ చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు రియల్ 5టీ.
కంపెనీ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. ఈ స్కూటర్ చూడడానికి స్పోర్టీ డిజైన్తో ఉంది. స్లిప్ ఎల్ఈడి హెడ్ లైట్, స్మొక్ట్ విజర్ కలిగి ఉంది. ఈ స్కూటర్ 124సీసీ పెట్రోల్ స్కూటర్ తో సమానం అని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ ఔట్పుట్ 15 బీహెచ్ పీ. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు115 కిలోమీటర్లు. ఇందులో రెండు 2.4 kwh లిథియం అయాన్ బ్యాటరీలు ఉన్నాయి. ఈ రియల్ 5టీ స్కూటర్ని ఒక్కసారి చార్జ్ చేస్తే 240 కిలోమీటర్లు వెళ్లవచ్చు అని కంపెనీ తెలిపింది. కంపెనీ ఈ స్కూటర్ చార్జింగ్ కు 1.84kwh చార్జర్ అందిస్తుంది.
new Electric Scooter features
దీంతో స్కూటర్ కు కేవలం రెండు గంటల్లోనే 80 శాతం చార్జింగ్ ఎక్కుతుంది అలాగే ఈ స్కూటర్లో మూడు రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, ఆటోమేటిక్ వార్నింగ్ లైట్స్, చార్జింగ్ పోర్ట్, రివర్స్ గేర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్కూటర్ ముందు భాగంలో డిస్క్ బ్రేక్ ఉంటుంది. వెనక భాగంలో డ్రం బ్రేక్ సిస్టం ఉంది. మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే కొన్ని రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఏథర్ 450 ఎక్స్, ఓలా ఎస్ 1, టీవీఎస్ ఐ క్యుబ్స్, బజాజ్ చేతక్, హీరో విధా వంటి మోడల్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎంచుకోవచ్చు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.