Redmi 11 Prime : ప్రస్తుతం ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ లను వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు జీవితంలో ఒక నిత్య వస్తువుగా మారిపోయింది. ప్రతి పనిని ఫోను ద్వారానే చేసుకుంటున్నారు. అందుకే మార్కెట్లోకి కొత్త కొత్త ఫోన్లు వస్తున్నాయి. ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమి తమ రెడ్ మీ సబ్ బ్రాండ్ కి కొత్త ఫోన్ రెడ్ మీ 11 ప్రైమ్ 5జీ ను మార్కెట్లోకి తీసుకొస్తుంది. సెప్టెంబర్ ఆరవ తేదీన ఇండియాలో ఈ కొత్త ఫోను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఫోను ఎప్పటినుంచి విక్రయించేది, ఏ మోడల్ అందుబాటులో ఉండేది ఆరోజున వెళ్లడించనున్నారు. అయితే ఈ ఫోన్ కి సంబంధించిన షియోమీ సంస్థ అధికారికంగా కొన్ని వివరాలు వెల్లడించింది.
అయినా ఉద్యోగ వర్గాల నుంచి ఐఎంఈఐ సీరియల్ నెంబరింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న వివరాలనుంచి కొన్ని వివరాలు లీక్ అయినట్టు టెక్ వెబ్సైట్లు పేర్కొన్నాయి. ఈ మేరకు ఈ కొత్త ఫోన్ స్పెసిఫికేషన్లను వెల్లడించాయి. ఈ కొత్త రెడ్ మీ 11 ప్రైమ్ 5జి ఫోన్లో రెండు సిం లు కూడా 5జీ ని సపోర్ట్ చేసే సదుపాయం ఉంటుంది. అవసరాన్ని బట్టి ఏ సిమ్ ను అయినా 5జీ నుంచి 4జీ జీఎస్ఎం వంటి వాటికి మార్చుకోవచ్చు. ఈ ఫోన్లో మీడియా టెక్ డైమన్సిటీ 700 ఆక్టాకోర్ చీప్ సెట్లు అమర్చారు. 4జిబి ర్యామ్ నుంచి 8 జిబి రామ్ వరకు అందుబాటులో ఉండనున్నాయి. 6.5 అంగుళాల టియర్ డ్రాప్ ఫుల్ హెచ్డి రిజర్వేషన్ తో డిస్ప్లే ఉండనుంది.
5000mAh సామర్థ్యం ఉన్న లిథియం పాలిమర్ జంబో బ్యాటరీ అందుబాటులో ఉంటుంది. కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్ డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ ను అమర్చబడింది. ఈ ఫోన్ ప్రాథమికంగా రెండు రంగుల్లో అందుబాటులోకి రానుంది. షియోమీ సంస్థ సబ్ బ్రాండ్ అయినా ఎం5 ఐదు జీ మోడల్ రీ బ్రాండ్ చేసి రెడ్ మీ 11 ఫ్రైమ్ 5జి కింద విడుదల చేస్తున్నట్టుగా టెక్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సెప్టెంబర్ 6న షియోమీ సంస్థ అధికారికంగా రెడ్ మీ 11 ప్రైమ్ 5జీ ఫోను ఆవిష్కరించి పూర్తి స్పెసిఫికేషను ప్రకటించినది. ఆ తర్వాత వివిధ ఆన్లైన్ కామర్స్ వెబ్సైట్లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.