Redmi 11 Prime : రాబోతున్న కొత్త రెడ్ మీ 11 ప్రైమ్ 5జీ ఫోన్… పూర్తి వివరాలు ఇవే… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Redmi 11 Prime : రాబోతున్న కొత్త రెడ్ మీ 11 ప్రైమ్ 5జీ ఫోన్… పూర్తి వివరాలు ఇవే…

Redmi 11 Prime : ప్రస్తుతం ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ లను వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు జీవితంలో ఒక నిత్య వస్తువుగా మారిపోయింది. ప్రతి పనిని ఫోను ద్వారానే చేసుకుంటున్నారు. అందుకే మార్కెట్లోకి కొత్త కొత్త ఫోన్లు వస్తున్నాయి. ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమి తమ రెడ్ మీ సబ్ బ్రాండ్ కి కొత్త ఫోన్ రెడ్ మీ 11 ప్రైమ్ 5జీ ను మార్కెట్లోకి తీసుకొస్తుంది. సెప్టెంబర్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :5 September 2022,4:00 pm

Redmi 11 Prime : ప్రస్తుతం ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ లను వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు జీవితంలో ఒక నిత్య వస్తువుగా మారిపోయింది. ప్రతి పనిని ఫోను ద్వారానే చేసుకుంటున్నారు. అందుకే మార్కెట్లోకి కొత్త కొత్త ఫోన్లు వస్తున్నాయి. ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమి తమ రెడ్ మీ సబ్ బ్రాండ్ కి కొత్త ఫోన్ రెడ్ మీ 11 ప్రైమ్ 5జీ ను మార్కెట్లోకి తీసుకొస్తుంది. సెప్టెంబర్ ఆరవ తేదీన ఇండియాలో ఈ కొత్త ఫోను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఫోను ఎప్పటినుంచి విక్రయించేది, ఏ మోడల్ అందుబాటులో ఉండేది ఆరోజున వెళ్లడించనున్నారు. అయితే ఈ ఫోన్ కి సంబంధించిన షియోమీ సంస్థ అధికారికంగా కొన్ని వివరాలు వెల్లడించింది.

అయినా ఉద్యోగ వర్గాల నుంచి ఐఎంఈఐ సీరియల్ నెంబరింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న వివరాలనుంచి కొన్ని వివరాలు లీక్ అయినట్టు టెక్ వెబ్సైట్లు పేర్కొన్నాయి. ఈ మేరకు ఈ కొత్త ఫోన్ స్పెసిఫికేషన్లను వెల్లడించాయి. ఈ కొత్త రెడ్ మీ 11 ప్రైమ్ 5జి ఫోన్లో రెండు సిం లు కూడా 5జీ ని సపోర్ట్ చేసే సదుపాయం ఉంటుంది. అవసరాన్ని బట్టి ఏ సిమ్ ను అయినా 5జీ నుంచి 4జీ జీఎస్ఎం వంటి వాటికి మార్చుకోవచ్చు. ఈ ఫోన్లో మీడియా టెక్ డైమన్సిటీ 700 ఆక్టాకోర్ చీప్ సెట్లు అమర్చారు. 4జిబి ర్యామ్ నుంచి 8 జిబి రామ్ వరకు అందుబాటులో ఉండనున్నాయి. 6.5 అంగుళాల టియర్ డ్రాప్ ఫుల్ హెచ్డి రిజర్వేషన్ తో డిస్ప్లే ఉండనుంది.

Redmi 11 Prime 5G phone specifications

Redmi 11 Prime 5G phone specifications

5000mAh సామర్థ్యం ఉన్న లిథియం పాలిమర్ జంబో బ్యాటరీ అందుబాటులో ఉంటుంది. కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్ డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ ను అమర్చబడింది. ఈ ఫోన్ ప్రాథమికంగా రెండు రంగుల్లో అందుబాటులోకి రానుంది. షియోమీ సంస్థ సబ్ బ్రాండ్ అయినా ఎం5 ఐదు జీ మోడల్ రీ బ్రాండ్ చేసి రెడ్ మీ 11 ఫ్రైమ్ 5జి కింద విడుదల చేస్తున్నట్టుగా టెక్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సెప్టెంబర్ 6న షియోమీ సంస్థ అధికారికంగా రెడ్ మీ 11 ప్రైమ్ 5జీ ఫోను ఆవిష్కరించి పూర్తి స్పెసిఫికేషను ప్రకటించినది. ఆ తర్వాత వివిధ ఆన్లైన్ కామర్స్ వెబ్సైట్లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది