
Samsung : బంపర్ ఆఫర్ ప్రకటించిన శామ్ సంగ్.. రూ.84వేల ఫోన్‌ని అంత తక్కువ ధరకి ఇస్తున్నారేంటి ?
Samsung : దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ తన శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 29తో ముగియనున్న ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ లో 60 శాతం డిస్కౌంట్‌పై అసాధారణ ఫీచర్లు, పెర్ఫార్మెన్స్ గల శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫోన్ విక్రయిస్తోంది. ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ.84,999. కాగా, ఫ్లిప్ కార్ట్ ద్వారా రూ.33,999లకే లభిస్తుంది. మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే.. టాప్ హై ఎండ్ ఫోన్- శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫోన్ తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. దీనికి అదనంగా ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫోన్ కొనుగోలు చేస్తే ఐదు శాతం అన్ లిమిటెడ్ క్యాష్ బ్యాక్ పొందొచ్చు.
Samsung : బంపర్ ఆఫర్ ప్రకటించిన శామ్ సంగ్.. రూ.84వేల ఫోన్‌ని అంత తక్కువ ధరకి ఇస్తున్నారేంటి ?
ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.26 వేల వరకూ ధర తగ్గింపు పొందొచ్చు.శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.4 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ + డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ ప్లే, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ – 50 మెగా పిక్సెల్ వైడ్ కెమెరా, 12 మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరా, 8 మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 10 మెగా పిక్సెల్స్ కెమెరా ఉంటాయి. 50-మెగా పిక్సెల్ కెమెరా 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ కలిగి ఉంటుంది. శాంసంగ్ నైటోగ్రఫీ మద్దతుతో అడ్వాన్స్డ్ డిజిటల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (వీడీఐఎస్), ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)లతో కూడిన కెమెరా సిస్టమ్ ఉంటుంది.
అలాగే.. ఎక్స్ నోస్ 2200 ఎస్వోసీ ప్రాసెసర్ కలిగి ఉంటుంది. 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ కలిగి ఉంటుంది. 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. కేవలం 30 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్ అవుతుంది. 5జీ, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, వైర్ లెస్ పవర్ షేర్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.గ్రీన్ లైన్ సమస్య ఎదుర్కొంటున్న యూజర్లకు శాంసంగ్ గుడ్‌న్యూస్ అందించింది. తమ మొబైల్ స్క్రీన్‌లో ఈ సమస్య ఉన్న వారికి ఉచితంగా అందించే స్క్రీన్ రీప్లేస్‌మెంట్ గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. శాంసంగ్ యూజర్లు కొంతకాలంగా గ్రీన్ లైన్ సమస్య ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.