Vivo Smart Phone : రూ.101 కే వివో స్మార్ట్ ఫోన్.. ఎలా అంటే…?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 19 October 2022, 8:00 am

Vivo Smart Phone : స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా అయితే ఇదే మంచి అవకాశం. ఎందుకంటే దీపావళి కానుకగా వివో కంపెనీ అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. అమెజాన్ ఫ్లిప్ కార్ట్ లకు పోటీగా వివో దీపావళి సేల్ ను తీసుకొచ్చింది. ఈ సేల్ లో భాగంగా ఫోన్ లపై ఏకంగా రూ.14 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. అమెజాన్ ఫ్లిప్ కార్ట్ సంస్థలు ఇప్పటికే గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్, బిగ్ దీపావళి సేల్ వంటి వాటితో జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు వీటికి పోటిగా స్మార్ట్ ఫోన్స్ తయారీ కంపెనీ వివో కూడా వచ్చి చేరింది. వివో కూడా దీపావళి సేల్ లో ప్రకటించింది. ఈ సేల్ అక్టోబర్ 23 వరకు ఉంటుంది. వివో కంపెనీ బిగ్ జాయ్ దీపావళి సేల్ నిర్వహిస్తోంది.

కంపెనీకి చెందిన పలు స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపును అందిస్తుంది. ఇంకా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి అందులో గరిష్టంగా 14000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 7000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈఎంఐ ట్రాన్సాక్షన్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అలాగే బజాజ్ ఫైనాన్స్ కస్టమర్లకు అయితే అదనంగా 1000 తగ్గింపు లభిస్తుంది. వివో టీ1 5జీ స్మార్ట్ ఫోన్ ను రూ.13,990 కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.15,990. వీ25 ఫోన్ ను రూ.25,999 కు కొనొచ్చు. దీని అసలు ధర రూ.32,999. అలాగే వీ25 ప్రో స్మార్ట్ ఫోన్ రేట్ రూ.39,999. అయితే దీనిని సేల్ లో రూ.32,499 కు పొందవచ్చు. వై16 ఫోన్ ను 13,999 కు కాకుండా రూ.9249 కు కొనవచ్చు. అలాగే వై22 ఫోన్ ను కూడా రూ.17,990 కు కాకుండా రూ.13,749 కు కొనవచ్చు.

What is a Rs.101 in Vivo smart phone

What is a Rs.101 in Vivo smart phone

టీ1 ఎక్స్ ఫోన్ ను రూ.11,999 కు కొనొచ్చు. దీని అసలు ధర రూ.16,990 గా ఉంది. టీ1 ప్రో ఫోన్ ను 28,990 కాకుండా రూ.18,999 కు కొనొచ్చు. టీ1 44 వాట్ ఫోన్ ను రూ.12,499 కే కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.19,990. వీ23 ప్రో ఫోన్ ను రూ.38,990 కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.41,990. వీ23ఇ ఫోన్ ను రూ.22,999 కు కొనొచ్చు. దీని అసలు ధర రూ.28,990. ఎక్స్80 ప్రో ఫోన్ పై భారీ తగ్గింపు లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.86,999. అయితే సేల్ లో భాగంగా దీనిని రూ.72,999 కు కొనొచ్చు. అదే ఎక్స్80 ఫోన్ ను అయితే రూ 50,499 కు కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.59,999. అయితే వివో దీపావళి సేల్ లో రూ.101 స్మార్ట్ ఫోన్ ఆఫర్ కూడా ఉంది. రూ.101 చెల్లించి వీ, ఎక్స్, వై సిరీస్ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. ఈఎంఐ లో రూ.101 చెల్లించి ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి