Categories: NewsTechnology

WhatsApp : ఇకపై వాట్సప్‌లో కూడా యాడ్స్.. కాకపోతే ..!

WhatsApp : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ కీలక మార్పుకు తెరలేపింది. ఇప్పటివరకు యాడ్స్‌ లేని యాప్‌గా పేరొందిన వాట్సప్‌ ఇకపై ప్రకటనలను ప్రవేశపెట్టబోతోంది. యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా, వ్యాపారాలకు, ఆర్గనైజేషన్లకు తమ సేవలను విస్తరించుకునే అవకాశాన్ని కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాట్సప్‌ తెలిపింది. రోజూ సుమారు 1.5 బిలియన్ల మంది యూజర్లు ‘అప్‌డేట్స్’ ట్యాబ్‌ను వీక్షిస్తున్నారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రకటనల ఏర్పాటుకు ముందడుగు వేసింది.

WhatsApp : ఇకపై వాట్సప్‌లో కూడా యాడ్స్.. కాకపోతే ..!

WhatsApp : వాట్సప్‌ యాజమాన్యం ఇలా కూడా డబ్బు సంపాదించడం స్టార్ట్ చేసిందా..?

ఈ ప్రకటనలు ‘అప్‌డేట్స్‌’ ట్యాబ్‌లోనే దర్శనమివ్వనున్నాయి. ప్రస్తుతం ఈ ట్యాబ్‌లో స్టేటస్‌లు, ఛానెళ్లు కనిపిస్తున్నాయి. ఇకపై అదే విభాగంలో మూడు కొత్త యాడ్ ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. మొదటిది ఛానెల్ సబ్‌స్క్రిప్షన్ , యూజర్లు నెలవారీ ఫీజు చెల్లించి తాము ఇష్టపడే ఛానెళ్లకు సపోర్ట్ చేయవచ్చు. రెండోది ప్రమోటెడ్ ఛానెల్స్ ..ఛానెల్‌ అడ్మిన్లు కొంత ఫీజు చెల్లించి తమ ఛానెళ్లను ఎక్కువ మందికి కనిపించేలా ప్రమోట్ చేసుకోవచ్చు. మూడోది స్టేటస్ యాడ్స్ – ఇప్పటివరకు వ్యక్తుల స్టేటస్‌లే కనిపించగా, ఇకపై వ్యాపార ప్రకటనలు కూడానే స్టేటస్‌ల రూపంలో దర్శనమిస్తాయి.

వాట్సప్ తాజా ప్రకటనతో యూజర్లలో ఆందోళనలు మొదలయ్యాయి. అయితే వాట్సప్ స్సష్టంగా తెలియజేసింది ఈ ప్రకటనలు కేవలం అప్‌డేట్స్‌ ట్యాబ్‌లో మాత్రమే ఉంటాయి, వ్యక్తిగత చాట్స్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ యాడ్స్‌ ఉండవు. యూజర్ ప్రైవసీపై తమ నిబద్ధత కొనసాగుతుందని సంస్థ తెలిపింది. కానీ ఈ ప్రకటనల ఫీచర్లు యాప్‌లో ఎప్పుడు అందుబాటులోకి వస్తాయన్న విషయం మాత్రం ఇంకా వెల్లడించలేదు.

Recent Posts

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

3 minutes ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

1 hour ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

3 hours ago

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…

4 hours ago

Airtel : ఒకే రీచార్జ్‌తో ఓటీటీల‌న్నీ కూడా ఫ్రీ.. ఎంత రీచార్జ్ చేసుకోవాలి అంటే…!

Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…

13 hours ago

Paritala Sunitha : ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నాడు : సునీత

Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…

14 hours ago

Kadiyam Srihari : వ్యవస్థలను, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసింది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీనే : కడియం

Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…

15 hours ago

Chandrababu : ఆటోలో ప్రయాణించిన సీఎం చంద్రబాబు.. స్వయంగా ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్న సీఎం..!

Chandrababu  : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…

16 hours ago