WhatsApp : ఇకపై వాట్సప్‌లో కూడా యాడ్స్.. కాకపోతే ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

WhatsApp : ఇకపై వాట్సప్‌లో కూడా యాడ్స్.. కాకపోతే ..!

 Authored By ramu | The Telugu News | Updated on :17 June 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  మీరు వాట్సప్‌ వాడుతున్నారా..? అయితే మీకు ఈ ఇబ్బంది తప్పదు

WhatsApp : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ కీలక మార్పుకు తెరలేపింది. ఇప్పటివరకు యాడ్స్‌ లేని యాప్‌గా పేరొందిన వాట్సప్‌ ఇకపై ప్రకటనలను ప్రవేశపెట్టబోతోంది. యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా, వ్యాపారాలకు, ఆర్గనైజేషన్లకు తమ సేవలను విస్తరించుకునే అవకాశాన్ని కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాట్సప్‌ తెలిపింది. రోజూ సుమారు 1.5 బిలియన్ల మంది యూజర్లు ‘అప్‌డేట్స్’ ట్యాబ్‌ను వీక్షిస్తున్నారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రకటనల ఏర్పాటుకు ముందడుగు వేసింది.

WhatsApp ఇకపై వాట్సప్‌లో కూడా యాడ్స్ కాకపోతే

WhatsApp : ఇకపై వాట్సప్‌లో కూడా యాడ్స్.. కాకపోతే ..!

WhatsApp : వాట్సప్‌ యాజమాన్యం ఇలా కూడా డబ్బు సంపాదించడం స్టార్ట్ చేసిందా..?

ఈ ప్రకటనలు ‘అప్‌డేట్స్‌’ ట్యాబ్‌లోనే దర్శనమివ్వనున్నాయి. ప్రస్తుతం ఈ ట్యాబ్‌లో స్టేటస్‌లు, ఛానెళ్లు కనిపిస్తున్నాయి. ఇకపై అదే విభాగంలో మూడు కొత్త యాడ్ ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. మొదటిది ఛానెల్ సబ్‌స్క్రిప్షన్ , యూజర్లు నెలవారీ ఫీజు చెల్లించి తాము ఇష్టపడే ఛానెళ్లకు సపోర్ట్ చేయవచ్చు. రెండోది ప్రమోటెడ్ ఛానెల్స్ ..ఛానెల్‌ అడ్మిన్లు కొంత ఫీజు చెల్లించి తమ ఛానెళ్లను ఎక్కువ మందికి కనిపించేలా ప్రమోట్ చేసుకోవచ్చు. మూడోది స్టేటస్ యాడ్స్ – ఇప్పటివరకు వ్యక్తుల స్టేటస్‌లే కనిపించగా, ఇకపై వ్యాపార ప్రకటనలు కూడానే స్టేటస్‌ల రూపంలో దర్శనమిస్తాయి.

వాట్సప్ తాజా ప్రకటనతో యూజర్లలో ఆందోళనలు మొదలయ్యాయి. అయితే వాట్సప్ స్సష్టంగా తెలియజేసింది ఈ ప్రకటనలు కేవలం అప్‌డేట్స్‌ ట్యాబ్‌లో మాత్రమే ఉంటాయి, వ్యక్తిగత చాట్స్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ యాడ్స్‌ ఉండవు. యూజర్ ప్రైవసీపై తమ నిబద్ధత కొనసాగుతుందని సంస్థ తెలిపింది. కానీ ఈ ప్రకటనల ఫీచర్లు యాప్‌లో ఎప్పుడు అందుబాటులోకి వస్తాయన్న విషయం మాత్రం ఇంకా వెల్లడించలేదు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది