
Whatsapp : జీరో క్లిక్ హ్యాక్ తో భయపడిపోతున్న వాట్సాప్ యూజర్స్.. లింక్ క్లిక్ చేస్తే అంతే..!
Whatsapp : ఈ మధ్య హ్యాకర్స్ spyware వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. వాట్సాప్ Whatsapp ద్వారా కూడా హ్యాకింగ్ ప్రయత్నం చేస్తున్నిరు. అయితే Whatsapp zero click వాట్సాప్ జీరో-క్లిక్ హ్యాక్ ద్వారా హ్యాకర్లు యూజర్ల ప్రమేయం లేకుండా ఆయా లింక్‌పై క్లిక్ చేయకుండానే ఫోన్‌లను హ్యాక్ Phone Hacked చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాట్సాప్ యూజర్లు Whatsapp అడ్వాన్స్‌డ్ స్పైవేర్ దాడి కారణంగా తీవ్రమైన భద్రతా ముప్పును ఎదుర్కొంటున్నారు. నివేదికల ప్రకారం.. ప్రమాదకరమైన సైబర్ దాడి cyber attack కనీసం 24 దేశాలలో వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు సూచించింది.
Whatsapp : జీరో క్లిక్ హ్యాక్ తో భయపడిపోతున్న వాట్సాప్ యూజర్స్.. లింక్ క్లిక్ చేస్తే అంతే..!
ఒక్క ఇటలీలోనే ఏడు కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇజ్రాయెల్ నిఘా సంస్థ పారగాన్ సొల్యూషన్స్‌తో ఇంటిగ్రేట్ అయిన స్పైవేర్‌ను ఉపయోగించి జర్నలిస్టులు, కార్యకర్తలు, పౌర సమాజ సభ్యుల వాట్సాప్ అకౌంట్లను హ్యాక్ చేశారు. వాట్సాప్ యూజర్లను లక్ష్యంగా చేసుకున్న స్పైవేర్‌ను కంపెనీ గుర్తించి వెంటనే ఇటలీ జాతీయ సైబర్ భద్రతా సంస్థను అప్రమత్తం చేసింది. ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని ఆఫీసు హ్యాకింగ్ ఘటనను తీవ్రంగా ఖండించింది. నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఈ కేసును దర్యాప్తు చేస్తోందని హామీ ఇచ్చింది. అయితే, ఈ స్పైవేర్ అటాక్‌తో తమకు ఎలాంటి ప్రమేయం లేదని ప్రభుత్వం ఖండించింది. ప్రైవసీ కారణాల వల్ల, బాధితుల పూర్తి జాబితాను వెల్లడించేందుకు నిరాకరించింది.
మీరు మీ వాట్సాప్ Whatsapp భద్రత కోసం టు-ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయండి. అనుమానాస్పద కాల్స్, గుర్తుతెలియని మెసేజ్‌లను నివారించండి. జీరో-క్లిక్ హ్యాకింగ్ పెద్ద ముప్పుగా మారుతోంది. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో వాట్సాప్ యూజర్లు తమ ఫోన్లను హ్యాకర్లు, స్కామర్ల నుంచి రక్షించుకోవడానికి ఎప్పటికప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. zero Click జీరో-క్లిక్ అనేది ‘పూర్తిగా రిమోట్ లేదా ఇంటరాక్షన్-తక్కువ “దాడులు అని పిలువబడే కష్టతరమైన పద్ధతి. ఈ పద్ధతిలో, సైబర్ క్రైమినల్స్ హానికరమైన ఫైళ్ళను లక్ష్యాలకు పంపుతాయి, వీటిని వాటి ఆపరేటింగ్ సిస్టమ్ లేదా అనువర్తనాల ద్వారా ప్రాసెస్ చేయడం కష్టం.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.