XChat : ఎలాన్‌ మస్క్‌ పెద్ద ప్లానే.. ఫోన్ నంబర్ లేకుండానే కాల్స్ చేయగల ఫీచర్ రాబోతుంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

XChat : ఎలాన్‌ మస్క్‌ పెద్ద ప్లానే.. ఫోన్ నంబర్ లేకుండానే కాల్స్ చేయగల ఫీచర్ రాబోతుంది..!

 Authored By ramu | The Telugu News | Updated on :10 June 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  XChat : ఎలాన్‌ మస్క్‌ పెద్ద ప్లానే.. ఫోన్ నంబర్ లేకుండానే కాల్స్ చేయగల ఫీచర్ రాబోతుంది..!

  •  WhatsApp కు పోటీగా ఎక్స్ యాప్..మస్కా..మజాకానా..!!

XChat : సంచలన ప్రకటనలు , సంచలన ప్రయోగాలు చేస్తూ వార్తల్లో నిలిచే ఎలాన్ మస్క్ Elon Musk ..తాజాగా ఆయన ప్రారంభించిన కొత్త మెసేజింగ్ ఫీచర్ “ఎక్స్ చాట్‌ (XChat)” కూడా అదే రీతిలో సంచలనంగా మారింది. ప్రపంచంలో ప్రాచుర్యం పొందిన వాట్సాప్‌, టెలిగ్రామ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లకు ప్రత్యామ్నాయంగా, ఎక్స్ యాప్‌ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఎక్స్‌ చాట్‌ ఫీచర్‌ ఇప్పుడు టెక్ ప్రపంచంలో చర్చనీయాంశమవుతోంది. ఇది ఇన్-యాప్ డైరెక్ట్ మెసేజింగ్ వ్యవస్థను ఆధారంగా చేసుకుని అభివృద్ధి చేయబడింది.

XChat ఎలాన్‌ మస్క్‌ పెద్ద ప్లానే ఫోన్ నంబర్ లేకుండానే కాల్స్ చేయగల ఫీచర్ రాబోతుంది

XChat : ఎలాన్‌ మస్క్‌ పెద్ద ప్లానే.. ఫోన్ నంబర్ లేకుండానే కాల్స్ చేయగల ఫీచర్ రాబోతుంది..!

XChat : WhatsApp కు పోటీగా మరో యాప్.. ఎవరు తీసుకొస్తున్నారో తెలుసా..?

ఎక్స్ చాట్‌ ఫీచర్‌లో ఎన్నో ఆధునిక అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ సాంకేతికతను అందించి, వినియోగదారుల సందేశాలను అత్యంత రహస్యంగా ఉంచే విధంగా రూపొందించారు. దీంతోపాటు, డిసప్పియరింగ్ మెసేజెస్, వాయిస్‌, వీడియో కాల్స్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఫోన్ నంబర్ అవసరం లేకుండానే కాల్స్ చేయగలగడం ఈ ఫీచర్‌కు ప్రత్యేక ఆకర్షణ. ఫైల్ షేరింగ్‌కు కూడా పూర్తి స్వేచ్ఛ ఇస్తోంది. ఈ ఫీచర్ల కారణంగా ఎక్స్ చాట్‌ మెసేజింగ్ మార్కెట్‌లోని ప్రముఖ యాప్‌లకు గట్టి పోటీగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ బీటా టెస్టింగ్ దశలో ఉంది. ప్రారంభంలో ఇది కేవలం ఎక్స్ యాప్‌ యొక్క సబ్‌స్క్రిప్షన్‌ వినియోగదారులకే అందుబాటులోకి రానుంది. ఉచిత యూజర్లకు ఇది ఎలాంటి పరిమితులతో లభిస్తుందో అనేది ఇంకా స్పష్టత లేదు. ఎక్స్‌ చాట్‌ ద్వారా ఎలాన్ మస్క్‌ తన ఎక్స్ ప్లాట్‌ఫామ్‌ను సాధారణ మైక్రోబ్లాగింగ్‌ యాప్‌గానే కాకుండా, మల్టీ ఫంక్షనల్ కమ్యూనికేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు కనిపిస్తోంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది