తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన సైదాబాద్ అత్యాచార నిందితుడి కోసం వారం రోజులుగా పోలీసులు వెతుకుతున్న సంగతి తెలిసిందే. కాగా నిందితుడు రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని కోసం రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడ పడుతున్న పోలీసులకు రాజు మృతదేహం లభ్యం అయింది.
ఈ ఘటన కొద్ది గంటల క్రితమే జరిగినట్టు పోలీసులు తెలుపుతున్నారు. వారం రోజుల క్రితం సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో చిన్నారిని అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితుడు రాజు ఎవరికీ చిక్కకుండా పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నాడు.కాగా అతన్ని పట్టిస్తే రూ.10లక్షలు ఇస్తామని పోలీసులు రివార్డు కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే రాజు కొద్ది సేపటి క్రితమే స్టేషన్ ఘన్‌పూర్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో ట్రైన్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా సమాచారం.
మృతుడి చేతిపై ఉన్నటువంటి పచ్చబొట్టు ఆధారంగా అది రాజు మృతదేహం అని పోలీసులు గుర్తించారు. ఇక అతని చేతిపై మౌనిక అనే పేరు ఆధారంగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఇక రాజు ఆత్మహత్యపై చిన్నారి కుటుంబ సభ్యులు స్పందించారు. తమకు డెడ్ బాడీని చూపిస్తే గానీ నమ్మలేమన్నారు. ఎందుకంటే ఈ కాలంలో అందరూ టాటూలు వేయించుకుంటున్నారని, కాబట్టి అతడి మృతదేహాన్ని ఒకసారి సైదాబాద్‌కు తీసుకువస్తే చూసిన తర్వాతే నమ్ముతామంటూ చెబుతున్నారు. కాగా ఇంకోవైపు రాజు కుటుంబ సభ్యులు ఈ విషయం తెలుసుకుని కన్నీరు పెడుతున్నారు.రాజు మృతదేహాన్ని స్థానికులు చూసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగి పూర్తి వివరాలు సేకరించేందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. అయితే అను ఏ టైమ్‌కు చేసుకున్నాడో, ఏ ట్రైన్ కింద పడ్డాడో తెలియాల్సి ఉంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.