Raju : స్టేషన్‌ఘన్‌పూర్ సమీపంలో… చిన్నారి హ‌త్య కేసు నిందితుడు రాజు ఆత్మ‌హ‌త్య‌..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Raju : స్టేషన్‌ఘన్‌పూర్ సమీపంలో… చిన్నారి హ‌త్య కేసు నిందితుడు రాజు ఆత్మ‌హ‌త్య‌..?

 Authored By praveen | The Telugu News | Updated on :16 September 2021,11:31 am

తెలంగాణ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన సైదాబాద్ అత్యాచార నిందితుడి కోసం వారం రోజులుగా పోలీసులు వెతుకుతున్న సంగ‌తి తెలిసిందే. కాగా నిందితుడు రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అత‌ని కోసం రాష్ట్ర వ్యాప్తంగా జ‌ల్లెడ ప‌డుతున్న పోలీసుల‌కు రాజు మృత‌దేహం ల‌భ్యం అయింది.

accused raju suicide AT station ghanpur

accused raju suicide AT station ghanpur

ట్రైన్ కింద ప‌డి ఆత్మహత్య..?

ఈ ఘ‌ట‌న కొద్ది గంటల క్రితమే జ‌రిగిన‌ట్టు పోలీసులు తెలుపుతున్నారు. వారం రోజుల క్రితం సైదాబాద్‌లోని సింగ‌రేణి కాల‌నీలో చిన్నారిని అత్యాచారం చేసి, హ‌త్య చేసిన నిందితుడు రాజు ఎవ‌రికీ చిక్క‌కుండా పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నాడు.కాగా అత‌న్ని ప‌ట్టిస్తే రూ.10ల‌క్ష‌లు ఇస్తామ‌ని పోలీసులు రివార్డు కూడా ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే రాజు కొద్ది సేప‌టి క్రితమే స్టేష‌న్ ఘ‌న్‌పూర్ రైల్వేస్టేష‌న్‌కు సమీపంలో ట్రైన్ కింద ప‌డి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా స‌మాచారం.

accused raju suicide AT station ghanpur

accused raju suicide AT station ghanpur

మృతుడి చేతిపై ఉన్న‌టువంటి ప‌చ్చ‌బొట్టు ఆధారంగా అది రాజు మృత‌దేహం అని పోలీసులు గుర్తించారు. ఇక అత‌ని చేతిపై మౌనిక అనే పేరు ఆధారంగా గుర్తించిన‌ట్టు తెలుస్తోంది. ఇక రాజు ఆత్మ‌హ‌త్య‌పై చిన్నారి కుటుంబ స‌భ్యులు స్పందించారు. త‌మ‌కు డెడ్ బాడీని చూపిస్తే గానీ న‌మ్మ‌లేమ‌న్నారు. ఎందుకంటే ఈ కాలంలో అంద‌రూ టాటూలు వేయించుకుంటున్నార‌ని, కాబ‌ట్టి అత‌డి మృత‌దేహాన్ని ఒక‌సారి సైదాబాద్‌కు తీసుకువ‌స్తే చూసిన త‌ర్వాతే న‌మ్ముతామంటూ చెబుతున్నారు. కాగా ఇంకోవైపు రాజు కుటుంబ స‌భ్యులు ఈ విష‌యం తెలుసుకుని క‌న్నీరు పెడుతున్నారు.రాజు మృత‌దేహాన్ని స్థానికులు చూసి స‌మాచారం ఇవ్వ‌డంతో పోలీసులు రంగంలోకి దిగి పూర్తి వివరాలు సేకరించేందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. అయితే అను ఏ టైమ్‌కు చేసుకున్నాడో, ఏ ట్రైన్ కింద పడ్డాడో తెలియాల్సి ఉంది.

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది