Telangana : నిజంగా గ్రేట్.. తెలంగాణలో ప్రభుత్వ స్కూల్స్ అన్ని ఫుల్.. అడ్మిషన్స్ అనేవి లేవు బోర్డు..!
Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల తీసుకున్న సంకల్పత్మక చర్యలు ఇప్పుడు ఫలితాలు ఇస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల ముందు “Admissions Closed” అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లోని MPPS ప్రాథమిక పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు పూర్తయిన నేపథ్యంలో, స్కూల్ ముందు “అడ్మిషన్స్ క్లోజ్” బోర్డు ఉంచడం ఈ మార్పుకు స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తోంది…
Telangana : నిజంగా గ్రేట్.. తెలంగాణలో ప్రభుత్వ స్కూల్స్ అన్ని ఫుల్.. అడ్మిషన్స్ అనేవి లేవు బోర్డు..!
రాష్ట్ర ప్రజల్లో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరగడమే ఈ దృశ్యాల వెనుక ఉన్న అసలైన నిజం. నూతన మౌలిక సదుపాయాలు, చక్కగా నిర్వహించబడుతున్న పాఠశాలలు, రుచికరమైన మధ్యాహ్న భోజనం, బహుళ భాషల్లో నైపుణ్యాలపై దృష్టి, మరియు సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇచ్చే కొత్త తరహా పాఠ్య విధానం విద్యార్థుల్ని ఆకర్షిస్తున్నాయి. ఈ మార్పు రేవంత్ రెడ్డి నాయకత్వంలో తీసుకున్న ప్రగతిశీల విద్యా విధానాలకు నిదర్శనం.
ఈ తరహా విజయం ఖిలాషాపూర్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక పాఠశాలల్లో కనిపిస్తోంది. ఇది కేవలం విద్యార్థులే కాదు, వారి తల్లిదండ్రుల నమ్మకాన్ని గెలుచుకున్న పాలనా శైలికి చిహ్నం. సమానమైన విద్యా అవకాశాలను అందించే దిశగా, ప్రైవేట్ పాఠశాలలపై ఆధారపడే పరిస్థితిని తగ్గిస్తూ, ప్రభుత్వ పాఠశాలల పట్ల గౌరవం పెంచే మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం దృఢంగా అడుగులు వేస్తోంది. “సర్కార్ బడి” ఇప్పుడు ప్రజల సెలక్షన్ అయింది – ఇది విద్యా రంగంలో సంకల్పబద్ధమైన మార్పుకు నాంది.
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
Guvvala Balaraju : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
Gym : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
This website uses cookies.