Wife : తల్లీ కూతుళ్లతో బ్యాంక్ ఉద్యోగి అక్రమ సంబంధం.. పోలీసుల విచారణ ఊహించని మలుపులు..!
Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బ్యాంక్ ఉద్యోగి పరారీలో ఉన్నాడు. జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్ (32) ప్రైవేటు సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. ఐశ్వర్యతో అతడికి ఈ ఏడాది ఫిబ్రవరి 13న వివాహం నిశ్చయమైంది.
Wife : తల్లీ కూతుళ్లతో బ్యాంక్ ఉద్యోగి అక్రమ సంబంధం.. పోలీసుల విచారణ ఊహించని మలుపులు..!
ఐశ్వర్య మాయమాటలు నమ్మి పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన తేజేశ్వర్ ఆమెనే పెళ్లి చేసకుంటానని పట్టుబట్టాడు. తల్లిదండ్రుల అభ్యంతరాలను కాదని పెద్దల సమక్షంలోనే మే 18న బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన రెండో రోజు నుంచే తేజేశ్వర్, ఐశ్వర్యల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఐశ్వర్య నిత్యం ఫోన్‌లో మాట్లాడుతూ.. భర్తను పట్టించుకోకపోవడంతో ఈ గొడవలు తలెత్తాయి.ఈ క్రమంలో జూన్ 17న తేజేశ్వర్ అదృశ్యమయ్యాడు. తేజేశ్వర్ కుటుంబసభ్యులు ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆమెను, ఆమె తల్లి సుజాతను విచారించారు. విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.
ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ఓ బ్యాంకులో స్వీపర్‌గా పనిచేస్తుండగా.. అదే బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తున్న తిరుమలరావుతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. సదరు ఉద్యోగి తల్లి సుజాతతో పాటుగా.. కూతురు ఐశ్వర్యను కూడా ట్రాప్ చేసి అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్‌ను అడ్డు తొలగిస్తే అతడి ఆస్తి తమ సొంతమవుతుందని భావించిన ఐశ్వర్య హత్యకు పథకం పన్నినట్లు తెలుస్తోంది. తిరుమల రావు కొందరికి సుపారీ ఇచ్చి తన డ్రైవర్‌ను వారి వెంట పంపినట్లు తెలిసింది. జూన్ 17న కొంతమంది వ్యక్తులు తేజేశ్వర్‌ను కలిసి 10 ఎకరాల పొలం సర్వే చేయాలని చెప్పి గద్వాల నుంచి కారులో తీసుకెళ్లారు. కారులోనే తేజేశ్వర్‌పై కత్తులతో దాడి చేసి గొంతుకోసి చంపేసి, మృతదేహాన్ని పాణ్యం సమీపంలో పారవేశారు.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.