AISF : ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థలు దోపిడీని అరికట్టాలి..!
AISF : మంగళవారం నాడు హిమాయత్ నగర్, సత్యనారాయణ రెడ్డి భవన్ లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థలు ఎటువంటి ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్నారు, ముక్యంగా నారాయణ, శ్రీచైతన్య, శ్రీ వశిష్ట ఇతర కార్పోరేట్ విద్యాసంస్థలు ఇష్టానుసారంగా విద్యార్థులను, విద్యార్థి తల్లిదండ్రులను మభ్య పెడుతూ ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్నారు, ఈ ప్రక్రియను అఖిల భారత విద్యార్ధి సమాఖ్య తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు.
AISF : ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థలు దోపిడీని అరికట్టాలి..!
రాష్ట్ర వ్యాప్తంగా 1500 ప్రైవేట్, కార్పోరేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి, దాదాపు ప్రతి సంవత్సరం 4 నుండి 5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ కళాశాలలో చేరుతున్నారు, కేవలం 500 పై చిలుకు ఉన్న కార్పోరేట్ కళాశాలలు మొత్తం విద్యార్థులను తమ కళాశాలలో చేర్చుకోవడానికి ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్నాయి, ముఖ్యంగా శ్రీ చైతన్య, నారాయణ, శ్రీ వశిష్ఠ రాష్ట్ర వ్యాప్తంగా ఏజెంట్లను, మరియు పీఆర్వో లను, నిరుద్యోగ యువతను పెట్టుకొని, వివిధ ఆకర్షణీయమైన ప్రకటనలతో, రాయితీల పేరుతో , ముందస్తు అడ్మిషన్లు చేస్తున్నారు, ఇంటర్ విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు, కనీసం వారిని నివారించే ప్రయత్నం కూడా చేయడం లేదు, కావున ఇంటర్ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న కార్పోరేట్ విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేసి, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది, లేని యెడల ఆయా విద్యాసంస్థలపై ప్రత్యక్ష ఆందోళనలు చేపడుతామని హెచ్చరించడం జరిగింది.ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్న శ్రీ చైతన్య, నారాయణ, శ్రీ వశిష్ఠ కి సంబందించిన వారిని విద్యార్ధి తల్లిదండ్రులు తరిమి కొట్టాలని, ఏఐఎస్ఎఫ్ నాయకత్వం కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటాం అని తెలియజేయడం జరిగింది. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గ్యార నరేష్ మాట్లాడుతూ.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఫీజుల నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి, విద్యావ్యాపారాన్ని అడ్డుకొని విద్యార్థులకు న్యాయం చేయాలనీ డిమాండ్ చేయడం జరిగింది, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు డొనేషన్ల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు,వాటిని అడ్డుకొని ,ఉన్నత విద్యామండలి “బి” కేటగిరి సీట్లను కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా భర్తీ చేయాలని కోరడం జరిగింది. సామిడి వంశీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే విద్యావ్యాపారాన్ని చేస్తున్న కార్పోరేట్ విద్యాసంస్థల్లో విద్యార్ధి తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించవద్దని కోరడం జరిగింది.
M Parmeshwar reddy : ఓల్డ్ రామంతాపూర్ శివాలయంలో శివరాత్రి mahashivratri 2025 సందర్భంగా ఈరోజు రథోత్సవ వేడుక సాయంత్రం…
Nagababu : జనసేన Janasena నేత నాగబాబు Nagababu భవిష్యత్తు, రాజకీయ ప్రయాణం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది.…
TDP ప్రస్తుతం టీడీపీ TDP లో పరిస్థితి వేరేలా ఉంది. మరో రెండు వారాల్లో ఎమ్మెల్సీ కాబోయే లక్కీ లీడర్లు…
Seethakka Vs Bandi Sanjay : ‘బీజేపీది BJP భారత్ టీం అని.. కాంగ్రెస్ది Congress పాకిస్థాన్ టీం’ అంటూ…
Ration Cards : తెలంగాణలో Telangana రేషన్ కార్డులు Ration Cards ఉన్నవారికి శుభవార్త. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారందరికీ శుభవార్త…
Kadakuntla Gangaram : చంద్ర న్యూస్ : కమ్యూనిస్టు పార్టీ నేత కార్మిక సంఘ నాయకుడు స్వర్గీయ కామ్రేడ్ కడకుంట్ల…
Ganta Srinivasa Rao : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు చాలా వేడెక్కిపోయి. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. టీడీపీ…
Sridevi Drama Company : దక్షిణ భారత రాష్ట్రాలలో నివసించే ప్రజలకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో నివసించే ప్రజలకు ఓ…
This website uses cookies.