Auto Drivers : తెలంగాణకు చెందిన మహిళలు, ఆడపిల్లలకు తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని డిసెంబర్ 9న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ స్కీమ్ చాలా మంచిది అని.. మహిళలకు చాలా ఉపయోగంగా ఉంటుందని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం అసలు ఇలా ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం ఇచ్చేకంటే కూడా టికెట్ల ధరలు తగ్గించవచ్చు కదా అంటున్నారు. అయిత.. ఇలా బస్సుల్లో ఉచిత ప్రయాణాలు పెడితే అది ఆటోలకు, క్యాబ్ లకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని మరికొందరి వాదన. ముఖ్యంగా అప్పు తెచ్చి మరీ ఆటో కొని నడిపే ఆటో డ్రైవర్ మాత్రం చాలా నష్టపోయే అవకాశం ఉంది. అసలు మేము ఎలా బతకాలి.. అంటూ కొందరు ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేను గత 5 ఏళ్ల నుంచి ఆటో నడుపుతున్నా. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇవ్వడంతో మాకు చాలా తక్కువ మహిళ ప్రయాణికులు వస్తారు. దాని వల్ల మాకు నష్టం కలుగుతుంది. అప్పులు చేసి ఆటోలు కొన్నాం. రోజుకు 400 కిరాయి ఇవ్వాలి. 5 లక్షలు పెట్టి ఆటో కొన్నాం. ఫైనాన్స్ కట్టాలి. దీనిపై భవిష్యత్తులో మేము ధర్నా కూడా చేస్తాం. మాకు యూనియన్ ఉంది. మాకు కూడా ఏదైనా సాయం చేయాలి అని ఓ ఆటో డ్రైవర్ అన్నారు. సీఎం సార్ ఈ విషయంలో మమ్మల్ని కూడా చూడాలి. ఆటోకు లాస్ అవుతుంది. ఫైనాన్స్ కట్టే డబ్బులు కూడా రావు. ఏం చేయాలి అంటూ ఆటో డ్రైవర్లు అంటున్నారు.
మీరు ఏదైనా చేయాలని అనుకుంటే బస్సు ఫ్రీ ఇస్తే ఆటో వాళ్లకు కూడా ఏదైనా చేయాలి కదా. ఆటోమెటిక్ గా ఆటోకు నష్టం రాకుండా ఆటో డ్రైవర్ల కోసం ఏదైనా స్కీమ్ తీసుకురావాలి. వాళ్లకు ఆర్థిక సాయం చేయాలి. రోజుకు 1000 వస్తే కూడా మాకు గిట్టుబాటు కాదు. పెట్రోల్ ఖర్చులు, గ్యాస్ ఖర్చులు, ఫైనాన్స్ అన్నీ చూస్తే మాకు మిగిలేది ఏం ఉండదు. మాకు కూడా ఏదైనా చేస్తే అప్పుడు మేము నష్టపోకుండా ఉంటాం. మహిళలకు ఏదైనా బెనిఫిట్ జరుగుతున్నప్పుడు అలాగే ఆటో వాళ్లకు కూడా అంతో ఇంతో ఉపయోగం ఉండేలా చేయాలని మరికొందరు ఆటో డ్రైవర్లు చెప్పుకొచ్చారు.
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
This website uses cookies.