Alcohol : మరోసారి బీర్ ధరలు పెంచే ఆలోచనలో ప్రభుత్వం..?
Alcohol : తెలంగాణలో త్వరలో మద్యం ధరలు పెరిగే అవకాశముంది. ఇప్పటికే బీరు ధరలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు బ్రాందీ, విస్కీ, స్కాచ్, రమ్ వంటి అన్ని రకాల మద్యం ధరలను పెంచడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల మద్యం వ్యాపారస్తుల సిండికేట్ ప్రత్యేకంగా సమావేశమై, ధరలను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో, ప్రభుత్వం మద్యం సరఫరా ఒప్పందాలను పునర్నిర్ణయించుకునే ముందే, కొత్త రేట్లను అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పెంపుతో చిన్న, మధ్య తరహా వినియోగదారులకు భారీ భారం పడే అవకాశం ఉంది.
Alcohol : మరోసారి బీర్ ధరలు పెంచే ఆలోచనలో ప్రభుత్వం..?
ప్రభుత్వం నియమించిన ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ మద్యం వ్యాపారుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని, ధరలను 15% నుండి 20% మధ్య పెంచే అవకాశాన్ని పరిశీలించినట్లు తెలుస్తోంది. తుది నిర్ణయంగా, 18% పెంచడానికి సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించినట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం నియంత్రణలో ఉన్న మద్యం విక్రయ వ్యవస్థలో మార్పులు చేస్తున్న నేపథ్యంలో, కొత్త ఒప్పందాలు అమల్లోకి రాకముందే మద్యం ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మద్యం ధరలు మరింత అధికమై, వినియోగదారులపై భారం పెరగనుంది.
ఇక వేసవి సీజన్‌లో బీరు ధరలను కూడా సమీక్షించాలని ఉత్పత్తిదారులు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. వేసవిలో నీటి కొరత పెరిగే అవకాశముండటంతో ఉత్పత్తి తగ్గుతుందని, అందువల్ల నష్టాన్ని తట్టుకునేందుకు బీరు ధరను మరో రూ. 10 పెంచాలని తయారీదారులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను కూడా పరిశీలనలో పెట్టినట్లు సమాచారం. ఏప్రిల్ మొదటి వారంలోనే ధరలు పెంచేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతుండటంతో, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
Smart Ration Cards : తెలంగాణ ప్రభుత్వం కొత్తగా జారీ చేసే కార్డులకు QR కోడ్‌ల రూపంలో స్మార్ట్ కార్డులను…
Ys Jagan : సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్న వైసీపీ, ఈ దెబ్బ నుంచి కోలుకునే ప్రయత్నాలు ముమ్మరం…
Paytm PhonePe UPI : ప్రస్తుతం ఎక్కడ చూడు ఫోన్‌ల ద్వారా ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారు. దాదాపు ప్రతి ఒక్కరూ…
Ysrcp : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. ముఖ్యంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మేయర్ పదవిపై…
High Blood Sugar : భారతదేశంలో ప్రతి వచ్చారం మధుమేహ పేషంట్ల కేసులు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. లో చెక్కర…
Heatwave : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దహించివేస్తున్నాయి. సాధారణంగా మే నెలలో కనిపించే భయంకరమైన ఎండలు ఈసారి మార్చిలోనే ప్రజలను…
Cement prices : సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త ఖనిజ పన్నులు విధించే అవకాశం ఉన్నందున వివిధ…
Sleep problems : ప్రతిరోజు నిద్రించే నిద్ర సంబంధిత సమస్యలలో 80 కంటే ఎక్కువ రకాల నిద్ర సంబంధిత సమస్యలు…
This website uses cookies.