Alcohol : మరోసారి బీర్ ధరలు పెంచే ఆలోచనలో ప్రభుత్వం..?
ప్రధానాంశాలు:
Alcohol : మరోసారి బీర్ ధరలు పెంచే ఆలోచనలో ప్రభుత్వం..?
Alcohol : తెలంగాణలో త్వరలో మద్యం ధరలు పెరిగే అవకాశముంది. ఇప్పటికే బీరు ధరలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు బ్రాందీ, విస్కీ, స్కాచ్, రమ్ వంటి అన్ని రకాల మద్యం ధరలను పెంచడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల మద్యం వ్యాపారస్తుల సిండికేట్ ప్రత్యేకంగా సమావేశమై, ధరలను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో, ప్రభుత్వం మద్యం సరఫరా ఒప్పందాలను పునర్నిర్ణయించుకునే ముందే, కొత్త రేట్లను అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పెంపుతో చిన్న, మధ్య తరహా వినియోగదారులకు భారీ భారం పడే అవకాశం ఉంది.

Alcohol : మరోసారి బీర్ ధరలు పెంచే ఆలోచనలో ప్రభుత్వం..?
Alcohol మందు బాబులకు కిక్ లేని న్యూస్
ప్రభుత్వం నియమించిన ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ మద్యం వ్యాపారుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని, ధరలను 15% నుండి 20% మధ్య పెంచే అవకాశాన్ని పరిశీలించినట్లు తెలుస్తోంది. తుది నిర్ణయంగా, 18% పెంచడానికి సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించినట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం నియంత్రణలో ఉన్న మద్యం విక్రయ వ్యవస్థలో మార్పులు చేస్తున్న నేపథ్యంలో, కొత్త ఒప్పందాలు అమల్లోకి రాకముందే మద్యం ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మద్యం ధరలు మరింత అధికమై, వినియోగదారులపై భారం పెరగనుంది.
ఇక వేసవి సీజన్‌లో బీరు ధరలను కూడా సమీక్షించాలని ఉత్పత్తిదారులు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. వేసవిలో నీటి కొరత పెరిగే అవకాశముండటంతో ఉత్పత్తి తగ్గుతుందని, అందువల్ల నష్టాన్ని తట్టుకునేందుకు బీరు ధరను మరో రూ. 10 పెంచాలని తయారీదారులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను కూడా పరిశీలనలో పెట్టినట్లు సమాచారం. ఏప్రిల్ మొదటి వారంలోనే ధరలు పెంచేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతుండటంతో, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.