Heatwave : వామ్మో.. మార్చిలోనే ఏమి ఎండలురా బాబు..!
Heatwave : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దహించివేస్తున్నాయి. సాధారణంగా మే నెలలో కనిపించే భయంకరమైన ఎండలు ఈసారి మార్చిలోనే ప్రజలను కాలిపోయేలా చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతుండగా, వడగాల్పులు విపరీతంగా వీచి జనాలను ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 42 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవ్వగా, మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేస్తూ, ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తోంది. వేడి గాలుల ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కువగా నీరు తాగాలని, అనవసరంగా ఎండలో తిరగవద్దని సూచనలు ఇస్తోంది.
Heatwave : వామ్మో.. మార్చిలోనే ఏమి ఎండలురా బాబు..!
ఏపీలో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భీకర స్థాయికి చేరాయి. పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 42 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాల్పుల ప్రభావం 100కి పైగా మండలాల్లో కనిపిస్తోంది. దీంతో ప్రజలు ఎండవేడిమి నుంచి రక్షణ కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఉదయం 11 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతుండటంతో రోడ్లపై జన సంచారం తగ్గిపోయింది. ఇటు తెలంగాణలోనూ అదే స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, భద్రాచలం, మహబూబ్‌నగర్, మెదక్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాల్పుల ప్రభావంతో ఒంటిపై నీరసం, డీహైడ్రేషన్ సమస్యలు పెరుగుతుండటంతో వైద్యులు, ఆరోగ్య నిపుణులు ప్రజలకు పలు సూచనలు అందిస్తున్నారు.
PM Kisan : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 ఫిబ్రవరి 24న బీహార్లోని భాగల్పూర్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి…
Jobs In Apple : ఆపిల్ భారతదేశంలో తన ఉనికిని క్రమంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో వివిధ డొమైన్లలో వందలాది…
Smart Ration Cards : తెలంగాణ ప్రభుత్వం కొత్తగా జారీ చేసే కార్డులకు QR కోడ్ల రూపంలో స్మార్ట్ కార్డులను…
Ys Jagan : సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్న వైసీపీ, ఈ దెబ్బ నుంచి కోలుకునే ప్రయత్నాలు ముమ్మరం…
Paytm PhonePe UPI : ప్రస్తుతం ఎక్కడ చూడు ఫోన్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారు. దాదాపు ప్రతి ఒక్కరూ…
Ysrcp : ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. ముఖ్యంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మేయర్ పదవిపై…
High Blood Sugar : భారతదేశంలో ప్రతి వచ్చారం మధుమేహ పేషంట్ల కేసులు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. లో చెక్కర…
Alcohol : తెలంగాణలో త్వరలో మద్యం ధరలు పెరిగే అవకాశముంది. ఇప్పటికే బీరు ధరలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు…
This website uses cookies.