Balapur Laddu : గత రికార్డ్ బ్రేక్ చేసిన బాలాపూర్ లడ్డు.. ఈ సారి ఎంత వేలం పలికింది అంటే...!
Balapur Laddu : ఖైరతాబాద్ వినాయకుడి తర్వాత హైదరాబాద్‌లో అంతటి ఖ్యాతి పొందింది మాత్రం బాలాపూర్ గణేశుడే. బాలాపూర్ లడ్డూ వేలంలో రికార్డ్ స్థాయిలో ధర పలికింది. గత ఏడాది కన్నా ఈసారి వేలంలో ఎక్కువగానే రేటు నమోదు అయ్యింది. లక్షల్లో లడ్డూ వేలం పలుకుతూ అందరి దృష్టి ఆకర్షించే బాలాపూర్ గణనాథుని చరిత్ర ఎంతో ఘనంగా ఉంది. లడ్డూ కొన్నవారికి కొంగు బంగారం అవుతుందనే నమ్మకం ఉండడంతో, ఈ ఏడాది సైతం రికార్డు స్థాయి ధర పలికింది. స్థానికుడు కొలను శంకర్ రెడ్డి, వేలం పాటలో రూ.30.1 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.
అయితే ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ వేలం పాట నిబంధనల్లో కొన్ని మార్పులు చేశారు. లడ్డు వేలం పాటలో పాల్గొనడానికి, దక్కించుకోవడానికి ఈ ఏడాది డిపాజిట్ తప్పని సరి చేశారు. అది కూడా గత ఏడాది లడ్డు ధరైన రూ. 27 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం అనే నిబంధన పెట్టారు. దీంతో ఈ లడ్డుని దక్కించుకోవాడానికి చైతన్య స్టిల్స్ అధినేత లింగాల దశరథ్ గౌడ్, సాహెబ్ నగరానికి చెందిన అర్బన్ గ్రూప్ అధినేత ప్రణీత్ రెడ్డి, బాలాపూర్ కి చెందిన బిజేపీ సీనియర్ లీడర్ కొలన్ శంకర్ రెడ్డి , నాదర్గుల్ కి చెందిన శ్రీ గీతా డైరీ అధినేత లక్ష్మీనారాయణలు వేలం పాటలో పాల్గొనడానికి కావాల్సిన డిపాజిట్ కట్టారు. చివరికి శంకర్ రెడ్డి బాలాపూర్ లడ్డూని 30లక్షల ఒక వెయ్యి రూపాయలకు లడ్డూను సొంతం చేసుకున్నారు.
Balapur Laddu : గత రికార్డ్ బ్రేక్ చేసిన బాలాపూర్ లడ్డు.. ఈ సారి ఎంత వేలం పలికింది అంటే…!
ఇకపోతే 1994నుంచి బాలాపూర్ లడ్డూ వేలం పాట కొనసాగుతోంది. మొట్టమొదట ఇది 450 రూ. లతో ప్రారంభమై ఇప్పుడు రూ.30 లక్షలకు పైగా చేరింది.బాలాపూర్‌లో ప్రతిష్టించే విజ్ఞాధిపతికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. భాగ్యనగరంలో బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాటకు ఘన చరిత్ర ఉంది. లంబోదరుడి చేతిలో పూజలు అందుకున్న లడ్డును దక్కించుకుంటే, వారింట సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.