Modi : భారత ప్రధాని మోదీ మంగళవారం నాడు 74వ పడిలోకి అడుగుపెట్టారు. ఒకచిన్న పట్టణంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన ప్రధాని మోదీ.. అంచెలంచెలుగా ఎదుగుతూ దేశ ప్రధాని అవడమేకాక వరుసగా మూడు సార్లు ప్రధానిగా ఉన్నారు.గుజరాత్‌లోని వాద్‌నగర్‌కు చెందిన ఒక సాధారణ టీ అమ్మకందారు నుంచి దేశంలోని అత్యున్నత పదవిని అధిష్టించేవరకు సాగిన ఆయన ఆయన ప్రయాణం భారత్ ను గర్వపడేలా చేస్తోంది.గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో దామోదర్‌దాస్ మోదీ, హీరాబెన్ దంపతులకు జన్మించిన నరేంద్ర మోదీ ఆ దంపతుల ఆరుగురు సంతానంలో మూడోవాడు. ఆయన తండ్రి వాద్‌నగర్ రైల్వే స్టేషన్‌లోని టీ స్టాల్‌లో టీ అమ్మేవాడు.తాపీ నదిలో వరదలు విధ్వంసం సృష్టించినప్పుడు, 9 ఏళ్ల మోదీ తన స్నేహితులతో కలిసి ఫుడ్ స్టాల్‌ను ప్రారంభించి, వచ్చిన మొత్తాన్ని సహాయ కార్యక్రమాల కోసం విరాళంగా ఇచ్చారని చాలామందికి తెలియదు.
ఇండో-పాకిస్థాన్ యుద్ధ సమయంలో సరిహద్దుల నుంచి తిరిగి వస్తున్న జవాన్లకుకూడా మోదీ టీ అందించారు. జామ్‌నగర్‌లోని సైనిక్ పాఠశాలలో చేరాలనే అతని కలలు అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా నెరవేరలేదు. కానీ కొన్నేళ్ల తరువాత ప్రధాని అయి 2014లో సియాచిన్ సందర్శనలో ఆర్మీ యూనిఫాం ధరించి తన కల నెరవేరినట్టు సంతోషించారు మోదీ. దేశం కోసం ఏవైనా వదులుకోవడానికి మోడీ ఎంత కఠినంగా ఉంటారు అన్నది ఆయన జీవితం చూస్తే అర్ధం అవుతుంది. శ్రీమతి ఇందిరాగాంధీ 1975లో విధించిన అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. బీజేపీలో 1987లో చేరి గుజరాత్ బాధ్యతలను చేపట్టారు.1978లో సూరత్, వడోదరకు ఆర్‌ఎస్‌ఎస్ సంభాగ్ ప్రచారక్‌గా నియమితులయ్యారు. 1990లో నరేంద్ర మోదీ గుజరాత్‌కు తిరిగి వచ్చారు. ఎల్‌కె అద్వానీ రథయాత్రలో కీలక బాధ్యత తీసుకుని చురుకుగా పనిచేశారు.
1994లో రాజకీయాల నుంచి కొంత విరామం తీసుకున్నారు. అద్వానీ ఆదేశంతో కొన్నిరోజులకే ఎన్నికల రాజకీయాలలోకి తిరిగి వచ్చారు. 1995లో గుజరాత్‌లో బీజేపీ విజయంలో కీలకపాత్ర పోషించారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో విపక్షాలు ఆయన రాజీనామా కోసం డిమాండ్ చేశాయి. అయితే గోవాలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన రాజీనామాను ఆమోదించలేదు. మోడీ వ్యక్తిగత జీవితం చూస్తే ఆయన చాలా చిన్న వయసులోనే దేశ పర్యటన చేశారు. ఇల్లు వదిలి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల మీదగా పశ్చిమ బెంగాల్ లోని కోల్ కటా , డార్జిలింగ్ వరకు వెళ్ళారు. ఇక కోల్ కటాలో రామకృష్ణ మఠంలో సన్యాసం తీసుకోవడానికి ఆ చిన్న వయసులోనే మోడీ ప్రయత్నం చేయగా అక్కడి నిబంధనలు అంగీకరించక పోవడంతో వెనక్కి వచ్చారు. మోడీలో పట్టుదల ఆయనకు దేశం పట్ల అంకిత భావం ఇవన్నీ ఆరెస్సెస్ వైపుగా నడిపించాయి. 1972లో గుజరాత్ రాష్ట్రంలో విశ్వహిందూ పరిషత్ తలపెట్టిన సాధు పరిషత్ కార్యక్రమ బాధ్యతలు, సభ కార్యక్రమాలు, విజయవంతంగా నిర్వహించి అలా మోడీ ఆరెస్సెస్ పెద్దల దృష్టిలో పడ్డారు. అలా ఆనాటి సంఘ్ లో సంస్థ సంఘ్ చాలక్ ల దృష్టి మోడీ మీద పడడంతో సంఘ్ లో మోదీకి కీలకమైన బాధ్యతలు అప్పగించడం జరిగింది. 2029లో జరిగే ఎన్నికల్లో మరోసారి ప్రధాని కావాలని చూస్తున్నారు. మరి ఆ కల సాకారం అవుతుందా అనేది చూడాలి.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.