Beer Sales : వామ్మో.. తెలంగాణ మందుబాబులు సరికొత్త రికార్డ్… ఎండల తీవ్రతకు రోజుకు 2 లక్షల బీర్లు తాగుతున్నార‌ట‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Beer Sales : వామ్మో.. తెలంగాణ మందుబాబులు సరికొత్త రికార్డ్… ఎండల తీవ్రతకు రోజుకు 2 లక్షల బీర్లు తాగుతున్నార‌ట‌..!

Beer Sales : ఎట్టకేలకు వేసవికాలం రానే వచ్చింది. గత పది రోజుల నుండి ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రత కారణంగా ఇంట్లో నుండి జనాలు బయటికి రాలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వేసవికాలంలో వైన్ షాపుల్లో చల్లగా దొరికే బీర్ల డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది.ఈసారి వేసవికాలం మార్చి నెల నుండి ప్రారంభమైంది. ఏప్రిల్ నెల వచ్చేసరికి భానుడు మరింత తాపాన్ని పెంచేశాడు . దీంతో తెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో దాదాపు 36 […]

 Authored By ramu | The Telugu News | Updated on :8 April 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Beer Sales : వామ్మో.. తెలంగాణ మందుబాబులు సరికొత్త రికార్డ్... ఎండల తీవ్రతకు రోజుకు 2 లక్షల బీర్లు తాగుతున్నార‌ట‌..!

Beer Sales : ఎట్టకేలకు వేసవికాలం రానే వచ్చింది. గత పది రోజుల నుండి ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రత కారణంగా ఇంట్లో నుండి జనాలు బయటికి రాలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వేసవికాలంలో వైన్ షాపుల్లో చల్లగా దొరికే బీర్ల డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది.ఈసారి వేసవికాలం మార్చి నెల నుండి ప్రారంభమైంది. ఏప్రిల్ నెల వచ్చేసరికి భానుడు మరింత తాపాన్ని పెంచేశాడు . దీంతో తెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో దాదాపు 36 నుండి 43 డిగ్రీల వరకు ఎండ తీవ్రత నమోదవుతుంది. ఇక ఈ ఎండల తీవ్రతకు భరించలేని ప్రజలు ఎక్కడ నీడ ఉంటే అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. మధ్యాహ్న సమయంలో అయితే నగర వీధులు , రోడ్డు మొత్తం కూడా నిర్మానుషంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ వేసవి తాపాన్ని తట్టుకోలేని వారంతా చల్లని పానీయాలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Beer Sales భానుడు భగభగ…

ఇక మన తెలంగాణ రాష్ట్రంలోని మద్యం బాబుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భానుడి తాపానికి తట్టుకోలేక వైన్ షాపులలో దొరికే చల్ల చల్లని బీర్లు కోసం క్యూ కట్టేస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం బీర్లు అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రతిరోజు గ్రేటర్ లో 60 నుండి 80 వేల కేసుల బీర్లు అమ్ముడుపోతున్నట్లుగా సమాచారం. అంతేకాదు మరో 20 కేసుల వరకు డిమాండ్ ఉన్నప్పటికీ మద్యం కొరత కారణంగా పూర్తిస్థాయిలో భీర్లు అందించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే 100 కేసులకు ఆర్డర్ వస్తే కేవలం 60 నుండి 70 కేసులు మాత్రమే నిర్వాహకులు సప్లై చేయగలుగుతున్నారు. ఇక ఏప్రిల్ నెలలోనే ఈ విధంగా కొరత కనిపిస్తే వచ్చే మే , జూన్ నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుదనేది అంతుచికడం లేదు.

Beer Sales వామ్మో తెలంగాణ మందుబాబులు సరికొత్త రికార్డ్ ఎండల తీవ్రతకు రోజుకు 2 లక్షల బీర్లు తాగుతున్నార‌ట‌

Beer Sales : వామ్మో.. తెలంగాణ మందుబాబులు సరికొత్త రికార్డ్… ఎండల తీవ్రతకు రోజుకు 2 లక్షల బీర్లు తాగుతున్నార‌ట‌..!

Beer Sales 15 లక్షల కేసుల బీర్లకు డిమాండ్….

ఇది ఇలా ఉండగా బీర్ కంపెనీల నుండి ప్రస్తుతం ఒక రోజుకు దాదాపు లక్ష నుండి 2 లక్షల కేసుల బీర్ల వరకు అందుతున్నాయని ఎక్సైజ్ అధికారులు తెలుపుతున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల కేసుల బీర్లు అమ్ముడు అవుతున్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్, మేడ్చల్ రంగారెడ్డి వంటి జిల్లాలో సగానికి పైగానే బీర్ల అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే గత ఏడాది లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ లో సుమారు 12 లక్షల కేసులకు డిమాండ్ ఉండగా , ఈ ఏడాది 15 లక్షల కేసులకు డిమాండ్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది