Beer Sales : వామ్మో.. తెలంగాణ మందుబాబులు సరికొత్త రికార్డ్... ఎండల తీవ్రతకు రోజుకు 2 లక్షల బీర్లు తాగుతున్నారట..!
Beer Sales : ఎట్టకేలకు వేసవికాలం రానే వచ్చింది. గత పది రోజుల నుండి ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రత కారణంగా ఇంట్లో నుండి జనాలు బయటికి రాలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వేసవికాలంలో వైన్ షాపుల్లో చల్లగా దొరికే బీర్ల డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది.ఈసారి వేసవికాలం మార్చి నెల నుండి ప్రారంభమైంది. ఏప్రిల్ నెల వచ్చేసరికి భానుడు మరింత తాపాన్ని పెంచేశాడు . దీంతో తెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో దాదాపు 36 నుండి 43 డిగ్రీల వరకు ఎండ తీవ్రత నమోదవుతుంది. ఇక ఈ ఎండల తీవ్రతకు భరించలేని ప్రజలు ఎక్కడ నీడ ఉంటే అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. మధ్యాహ్న సమయంలో అయితే నగర వీధులు , రోడ్డు మొత్తం కూడా నిర్మానుషంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ వేసవి తాపాన్ని తట్టుకోలేని వారంతా చల్లని పానీయాలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక మన తెలంగాణ రాష్ట్రంలోని మద్యం బాబుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భానుడి తాపానికి తట్టుకోలేక వైన్ షాపులలో దొరికే చల్ల చల్లని బీర్లు కోసం క్యూ కట్టేస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం బీర్లు అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రతిరోజు గ్రేటర్ లో 60 నుండి 80 వేల కేసుల బీర్లు అమ్ముడుపోతున్నట్లుగా సమాచారం. అంతేకాదు మరో 20 కేసుల వరకు డిమాండ్ ఉన్నప్పటికీ మద్యం కొరత కారణంగా పూర్తిస్థాయిలో భీర్లు అందించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే 100 కేసులకు ఆర్డర్ వస్తే కేవలం 60 నుండి 70 కేసులు మాత్రమే నిర్వాహకులు సప్లై చేయగలుగుతున్నారు. ఇక ఏప్రిల్ నెలలోనే ఈ విధంగా కొరత కనిపిస్తే వచ్చే మే , జూన్ నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుదనేది అంతుచికడం లేదు.
Beer Sales : వామ్మో.. తెలంగాణ మందుబాబులు సరికొత్త రికార్డ్… ఎండల తీవ్రతకు రోజుకు 2 లక్షల బీర్లు తాగుతున్నారట..!
ఇది ఇలా ఉండగా బీర్ కంపెనీల నుండి ప్రస్తుతం ఒక రోజుకు దాదాపు లక్ష నుండి 2 లక్షల కేసుల బీర్ల వరకు అందుతున్నాయని ఎక్సైజ్ అధికారులు తెలుపుతున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల కేసుల బీర్లు అమ్ముడు అవుతున్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్, మేడ్చల్ రంగారెడ్డి వంటి జిల్లాలో సగానికి పైగానే బీర్ల అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే గత ఏడాది లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ లో సుమారు 12 లక్షల కేసులకు డిమాండ్ ఉండగా , ఈ ఏడాది 15 లక్షల కేసులకు డిమాండ్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.