Rajitha Parameshwar Reddy : భగాయత్‌లో పారిశుద్ధ్యానికి పెద్దపీట.. రజితాపరమేశ్వర్‌రెడ్డి
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ భగాయత్‌లోని హెచ్ఎండీఏ లే అవుట్‌లో పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టుగా ఉప్పల్ వార్డు ఆఫీస్ లో జిహెచ్ ఎం సి అధికారులు మరియు ఉప్పల్ HMDA బాగాయత్ రెసిడెన్షల్ వెల్ఫర్ అసోసియేషన్ సభ్యుల సామావేశం లో కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. సిబ్బంది నియామకం, డస్ట్ బిన్‌ల ఏర్పాటు వంటి అంశాలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో అధికారులు, సిబ్బంది కూడా సమన్వయంతో పని చేయాలని సూచించారు.
Rajitha Parameshwar Reddy : భగాయత్‌లో పారిశుద్ధ్యానికి పెద్దపీట.. రజితాపరమేశ్వర్‌రెడ్డి
ఉప్పల్ సర్కిల్‌లోన పారిశుద్ధ్య విభాగం, వీధి దీపాల నిర్వహణకు విద్యుత్ శాఖ అధికారులతో కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్‌రెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. పారిశుద్ధ్య సిబ్బంది నియామక ప్రక్రియ తుది దశలో ఉందని ఈ సందర్భంగా రజితాపరమేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మొదటి విడతలోనే భగాయత్‌లో పారిశుద్ధ్యం కోసం 25 మంది సిబ్బందిని నియమించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. అతి త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. రెండో విడతలో ఇంకా కావాల్సిన పారిశుద్ధ్య కార్మికుల నియామకం జరుగుతుందన్నారు. భగాయత్‌లోని వీధుల్లో చెత్త వేయకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు చేపట్టనున్నట్టుగా రజితాపరమేశ్వర్‌రెడ్డి చెప్పారు. భగాయత్‌లోని అన్ని వీధుల్లో చెత్త డబ్బాలను ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా సిద్ధం చేశామన్నారు.
వీధి దీపాల నిర్వహణపై కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా రజితాపరమేశ్వర్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే భగాయత్ లో వీధి దీపాల ను సైతం ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు.
ఈ కార్యక్రమం లో ఏఎంహెచ్ ఓ రంజిత్ గారు ,జి హెచ్ ఎంసీ ఎలక్ట్రికల్ డిఈ రవీందర్ గారు ఏ ఈ టి ఆర్ ప్రసాద్ గారు ,ఉప్పల్ HMDA బాగాయత్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్ రావు గారు సుధాకర్ రెడ్డి గారు ,వంశీ దార్ రెడ్డి గారు ,ఈగ సంతోష్,లింగంపల్లి రామకృష్ణ,చిరంజీవి రెడ్డి గారు ,మహేష్,నరేంద్ర చౌదరి గారు ,మనోహర్ రెడ్డి గారు ,అంజి రెడ్డి ,శివ ప్రసాద్ శుభన్ రెడ్డి సామ్ జంగయ్య పాల్గొన్నారు
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…
Special Song | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ‘OG (They Call Him…
Revanth Reddy | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. హైకోర్టు తాజా తీర్పు…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ (They Call Him OG)’…
Akhanda 2 | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ చిత్రం ‘అఖండ 2’ ప్రస్తుతం షూటింగ్…
Airport | శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఉదయం ఒక ఇండిగో విమానానికి Indigo పెను ప్రమాదం తప్పింది.…
This website uses cookies.