
BJP : బీజేపీకి బిగ్ షాక్.. తెలంగాణ కీలక ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా..!
BJP : తెలంగాణ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ కి రాజీనామా చేయడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి తనను నామినేట్ చేయనందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కి తన రాజీనామా లేఖను పంపించినట్లు చెప్పారు. ఆయన పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మాట్లాడారు. “2014 నుండి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా పార్టీకి అంకితభావంతో పనిచేశాను. నా కుటుంబం ఉగ్రవాదుల టార్గెట్ అయినా, నేనెప్పుడూ వెనక్కి తగ్గలేదు” అని పేర్కొన్నారు. “మీకో దండం.. మీ పార్టీకో దండం” అని వ్యాఖ్యానిస్తూ తీవ్ర విమర్శలు చేశారు.
BJP : బీజేపీకి బిగ్ షాక్.. తెలంగాణ కీలక ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా..!
“బీజేపీని వదిలినా, హిందుత్వం, ధర్మం అనే నా మార్గం మాత్రం మరిచిపోను” అన్నారు. ఇక నుంచి మరింత బలంగా హిందూ సమాజానికి అండగా నిలుస్తానని పేర్కొన్నారు. బీజేపీకి రాజీనామా చేయడం తేలికకాదని, ఇది తన జీవితంలో తీసుకున్న కఠినమైన నిర్ణయమని అన్నారు. తెలంగాణలో ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, సరైన నాయకత్వం లేకపోవడం వల్ల పార్టీ ఎదుగుదల తడిసిమోపెత్తుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కీలక నిర్ణయాలు కార్యకర్తల్లో అసంతృప్తికి కారణమవుతున్నాయని తెలిపారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి పై తీసుకుంటున్న నిర్ణయాలే తమతో పాటు అనేక మంది కార్యకర్తలను నిరాశకు గురిచేశాయని రాజాసింగ్ విమర్శించారు. రామచందర్ రావు అధ్యక్ష పదవిని అందుకుంటున్నారన్న వార్తలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కొందరు పార్టీ నాయకత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. గతంలో బీజేపీ నుంచి సస్పెండ్ అయినా, తిరిగి పార్టీలోకి వచ్చి సేవలందించిన ఆయన ఇప్పుడు పూర్తిగా పార్టీకి గుడ్‌బై చెప్పారు. హిందుత్వ భావజాలాన్ని బలంగా కొనసాగించే ఆయన ఈ తరహా నిర్ణయం తీసుకోవడం బీజేపీకి పెద్ద నష్టంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.