Bird Flu : బాబోయ్.. 8వేల కోళ్లు మృతి.. బర్డ్ ఫ్లూనే కారణమా.. భయాందోళనలో ఆ రెండు జిల్లాల ప్రజలు
Bird Flu : తెలంగాణలో బర్డ్ ఫ్లూ మరోసారి కలకలం రేపింది. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వేలాది కోళ్లు చనిపోతున్నాయి. దీంతో ఆయా జిల్లాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న పశువైద్య అధికారులు చనిపోయిన కోళ్లను పరీక్షల కోసం హైదరాబాద్ ల్యాబ్‌కు పంపారు.గత కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాల్లో తొలి కేసు వెలుగులోకి వచ్చింది. లక్షలాది కోళ్లు చనిపోయాయి. తెలంగాణలోని అనేక కోళ్ల ఫారాలలో కూడా కోళ్లు చనిపోయాయి.
యాదాద్రి జిల్లాలో కూడా తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇటీవల సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. ఈ రెండు జిల్లాల్లో వేలాది కోళ్లు చనిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం సమీపంలోని కోళ్ల ఫారంలో మూడు రోజుల్లో ఏడు వేలకు పైగా కోళ్లు చనిపోయాయి. మెదక్ జిల్లా కోల్చారం మండలం నాయిని జలాల్‌పూర్‌లోని ఒక కోళ్ల ఫారంలో గత రెండు రోజుల్లో వెయ్యికి పైగా కోళ్లు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయాయి.
Bird Flu : బాబోయ్.. 8వేల కోళ్లు మృతి.. బర్డ్ ఫ్లూనే కారణమా.. భయాందోళనలో ఆ రెండు జిల్లాల ప్రజలు
కోళ్ల మరణానికి గల కారణాలు నివేదికలు వచ్చిన తర్వాత తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు. 100 డిగ్రీల సెల్సియస్ వద్ద చికెన్ వండిన తర్వాతే తినాలని వారు సలహా ఇస్తున్నారు. బర్డ్ ఫ్లూ భయం కారణంగా నెల రోజులుగా స్తబ్ధుగా ఉన్న చికెన్ దుకాణాలు ఆదివారం కాస్త బిజీగా మారాయి. ఎక్కువగా ఉడికించిన చికెన్ తినడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని అధికారులు చెప్పడంతో, చికెన్ ప్రియులు చికెన్ కొనుగోలు చేస్తున్నారు.
Cucumber : మీరు రిఫ్రెషింగ్, ఆరోగ్యకరమైన చిరుతిండి కోసం చూస్తున్నట్లయితే కీర దోసకాయలు ఒక గొప్ప ఎంపిక. వాటిలో కేలరీలు…
Mango Tree ఇది సమ్మర్ సీజన్. మామిడి కాయలు విరివిగా కాస్తుంటాయి. మ్యాంగో లవర్స్ కూడా ఈ సీజన్‌లో మామిడి…
Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్…
Chandrababu Naidu : ఏపీ రైతులకు AP CM Chandrababu సీఎం చంద్రబాబు శుభవార్తను తెలిపారు. రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న…
TDP Mahanadu : తెలుగుదేశం పార్టీ (టీడీపీ) యొక్క వార్షిక మహానాడు ఈ నెల 27 నుండి 29 వరకు…
Whatsapp : మెటా ఇప్పుడు వాట్సాప్‌లో కొత్త విధానాన్ని ప్రారంభించింది. దీని ద్వారా సందేశ పరిమితి సెట్ చేయబడుతుంది. ఈ…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్రంలో భూ భారతి చట్టం అమలుకు నేటి నుంచి శ్రీకారం చుట్టారు. ఈ చట్టం…
IPL SRH : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో పలు జట్లు రేసు నుండి తప్పుకోగా, సన్ రైజర్స్ హైదరాబాద్…
This website uses cookies.