Home » Exclusive » Bjp Call For Telangana State Bandh
Exclusive

BJP : తెలంగాణ బంద్‌కు బీజేపీ పిలుపు.. ఎప్పుడంటే?

Authored By
mallesh
The Telugu News | Published on: January 5, 2022, 7:50 pm
Advertisement

BJP : రాష్ట్రంలో తెలంగాణ సర్కారు జారీ చేసిన జీవో నెం.317ను బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఈ జీవోను సస్పెండ్ చేయాలని బీజేపీ నేతలు నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తన పార్టీ కార్యాలయంలో నిరసన తెలుపుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఇకపోతే ఈ జీవో రాష్ట్రపతి ఉత్తర్వులు ఉల్లంఘించి జారీ చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Advertisement

ఈ క్రమంలోనే నూతన జోనల్ విధానం ద్వారా తెలంగాణ సర్కారు బదిలీలు చేపట్టగా, ఈ జీవోపై పున: సమీక్షించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. తెలంగాణ సర్కారు జీవోను పున: సమీక్షించాలని కోరుతూ ఈ నెల 10న తెలంగాణ బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది.

bjp call for telangana state bandh

Advertisement

BJP : ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఈ జీవోతో ఇబ్బందులంటున్న కమలనాథులు..

ఉద్యోగ, ఉపాధ్యాయులు ఈ బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని కమలనాథులు పిలుపునిచ్చారు. ఈ జీవో వలన ఉద్యోగులు స్థానికత కోల్పోతున్నారని కమలం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. జీవో నెం.317కు వ్యతిరేకంగా దీక్ష చేసిన బండి సంజయ్ పోలీసులు అరెస్టు చేయగా, కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి