Etela Rajender : ప్రస్తుతం వరంగల్ లో కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న రచ్చ గురించి తెలుసు కదా. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేయడంపై పలు విద్యార్థి సంఘాలు మండిపడుతున్నారు. యూనివర్సిటీలో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై దాడి చేయడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. కాకతీయ యూనివర్సిటీ వీసీనే విద్యార్థులను పోలీసులతో కొట్టించారని పలు పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు.
నిరసన చేస్తే పోలీసులు ఇలా దాడి చేస్తారా అంటూ ఈటల మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఈటల మండిపడ్డారు. విద్యార్థులను పోలీసులు ఇష్టానుసారంగా కొట్టారని అక్రమ కేసులు పెట్టించారని ఈటల అన్నారు. బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులను కొట్టించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ సర్కారు పదేళ్ల పాలనతో తీవ్ర నష్టం జరుగుతోంది. బకాయిలు ఎగ్గొట్టే రైతులు అనే ముద్ర తెలంగాణ ప్రభుత్వం మీద పడింది అన్నారు.విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ కూడా సరిగ్గా అందించడం లేదని, హోంగార్డులను నిర్లక్ష్యం చేస్తోందని.. ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయని ఈటల ధ్వజమెత్తారు. తప్పుడు ప్రచారం చేసి మళ్లీ అధికారంలోకి రావాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారు.
అప్పులలో నెంబర్ వన్, భూములు అమ్ముకోవడంలో నెంబర్ వన్, తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ కేసీఆర్ ఇచ్చారని బీఆర్ఎస్ నేతలు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేస్తానని ప్రకటించారు. మోసపు మాటలు నమ్మితే రాష్ట్రం అధోగతి పాలు అవుతుందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల తెలిపారు.
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
Seaplane Trial Run : విమానాశ్రయ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, విమానయాన సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడం మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను…
Tollywood Actors : టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకే ఫ్రేములో కనిపించడం చాలా అరుదు. ప్రత్యేక సందర్భాలలో వారు కలిసి…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌజ్‌లోని కంటెస్టెంట్స్‌ని చూస్తుంటే వారు సెలబ్రిటీల మాదిరిగా కనిపించడం లేదు.…
RBI : ఆర్ధిక అవసరాల దృష్ట్యా చూస్తే చాలామంది తమ బ్యాంక్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ ను ఉంచడంలో విఫలమవుతున్నారు.…
Coconut Oil : కొబ్బరి చెట్టును కల్ప వృక్షం అని అంటారు. ఎందుకు అంటే ఈ చెట్టు నుండి దొరికే అన్ని…
Airport Jobs : ఏ.ఐ ఎయిర్ పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ (ఏ.ఐ.ఏ.ఎస్.ఎల్) అనే సంస్థ ఎయిర్ పోర్ట్ సర్వీసుల కోసం…
This website uses cookies.