Etela Rajender : ఈటల రాజేందర్ రాజీనామా? అసలు రీజన్ ఇదే?
Etela Rajender : ప్రస్తుతం వరంగల్ లో కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న రచ్చ గురించి తెలుసు కదా. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేయడంపై పలు విద్యార్థి సంఘాలు మండిపడుతున్నారు. యూనివర్సిటీలో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై దాడి చేయడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. కాకతీయ యూనివర్సిటీ వీసీనే విద్యార్థులను పోలీసులతో కొట్టించారని పలు పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు.
నిరసన చేస్తే పోలీసులు ఇలా దాడి చేస్తారా అంటూ ఈటల మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఈటల మండిపడ్డారు. విద్యార్థులను పోలీసులు ఇష్టానుసారంగా కొట్టారని అక్రమ కేసులు పెట్టించారని ఈటల అన్నారు. బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులను కొట్టించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ సర్కారు పదేళ్ల పాలనతో తీవ్ర నష్టం జరుగుతోంది. బకాయిలు ఎగ్గొట్టే రైతులు అనే ముద్ర తెలంగాణ ప్రభుత్వం మీద పడింది అన్నారు.విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ కూడా సరిగ్గా అందించడం లేదని, హోంగార్డులను నిర్లక్ష్యం చేస్తోందని.. ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయని ఈటల ధ్వజమెత్తారు. తప్పుడు ప్రచారం చేసి మళ్లీ అధికారంలోకి రావాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారు.
Etela Rajender : విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఏది?
అప్పులలో నెంబర్ వన్, భూములు అమ్ముకోవడంలో నెంబర్ వన్, తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ కేసీఆర్ ఇచ్చారని బీఆర్ఎస్ నేతలు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేస్తానని ప్రకటించారు. మోసపు మాటలు నమ్మితే రాష్ట్రం అధోగతి పాలు అవుతుందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల తెలిపారు.