BRS : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొన్ని నెలలు అవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేఖతో ప్రజలు కాంగ్రెస్‌ని గెలిపించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నీ తుస్సుమన్నాయని, కాంగ్రెస్ ప్రచారంలో 6 గ్యారంటీల్లో ఐదు అమలు చేసినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారని, జాబ్ క్యాలెండర్ పత్తా లేకుండా పోయిందని హరీష్ రావు విమర్శించడం మనం చూశాం. ఉపాధ్యాయుల మీద లాఠీ ఛార్జ్ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని ఆరోపించారు
గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు పెంచిందని, మహిళా గ్రాడ్యుయేట్‌లు కూడా బీఆర్ఎస్‌కు సపోర్ట్ చేస్తున్నారన్నారు. మహిళా పథకం కింద వారికి నెలకు రూ. 2,500 ఇస్తాం అని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. విద్యుత్ ఉద్యోగులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని హరీష్ రావు అన్నారు. మరోవైపు కేటీఆర్ కూడా ఛాన్స్ దొరికినప్పుడల్లా కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తుండడం మనం చూస్తూ ఉన్నాం.అయితే ఇప్పుడు జనాలలో కాంగ్రెస్‌పై కాస్త వ్యతిరేఖత వచ్చినట్టుగా కనిపిస్తుంది. ప్రజా వ్యతిరేఖ విధానాలతో కాంగ్రెస్ నెగెటివిటీని బాగా కూడగట్టుకుందని అంటున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నాయకులు వాయిస్ పెంచి అవకాశాలని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అవకాశాన్ని వినియోగించుకోవల్సిన బీజేపీ మాత్రం సైలెంట్ అయిపోయింది. బీజేపీ నుండి ఏలేటి మహేందర్ రెడ్డి తప్ప ఎవరు కాంగ్రెస్‌ని విమర్శించిన దాఖలాలు లేవు.బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి దెబ్బ తగిలినప్పటికీ అంతర్గతంగా.. బహిరంగంగా అనేక సమస్యలు ఎదుర్కుంటున్నప్పటికీ ప్రభుత్వంపై ప్రతి విషయంలోనూ విమర్శలు గుప్పించడానికి రెడీగా ఉంటోంది.
ప్రతి విషయంలోనూ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు. రైతు రుణమాఫీ విషయంలోనూ.. ఒకే సారి చేస్తామని చెప్పి.. మొదట రైతు బంధు నిధులు మాత్రమే దారి మళ్లించి ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ పై ఎటాక్ చేయడంలో బీఆర్ఎస్ లాజికల్ గా ఉంది మరో ప్రతిపక్ష పార్టీ బీజేపీ మాత్రం ఈ విషయంలో పెద్దగా ప్రజల దృష్టిలో పడలేకపోతోంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు. కానీ ఆయన కేంద్ర మంత్రిగా బిజీగా ఉంటారు. అంతకు మందు తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఉన్న బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రి అయ్యారు. అయన కుదిరినప్పుడల్లా వచ్చి కార్యక్రమాలు పెడుతున్నారు కానీ అన్నీ పార్ట్ టైమ్ వ్యవహారాలుగా మిగిలిపోతున్నాయి. ఈ కారణంగా బీజేపీ పెద్దగా ఫీల్డ్ లో లేదన్న అభిప్రాయం బలపడుతోంది.
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.