CM Revanth Reddy : అధికారంలోకి వచ్చినప్పటి నుండి రేవంత్ రెడ్డి తనదైన పాలనతో దూసుకుపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాగా, రేవంత్ రెడ్డి నాయకత్వంలో సుపరిపాలన నడుస్తుంది. ముఖ్యంగా డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతుండడంపై అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని చేయాలని భావించి ప్రత్యేక చర్యలు చేపట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్‌కు రేవంత్ రెడ్డి చేరుకున్నారు. సీఎం హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లారు. కమాండ్ కంట్రోల్‌లో ఉండే అధికారులు విధులు, ఇతర అంశాలపై సమీక్షించారు.
అయితే నార్కోటిక్స్ బ్యూరో పనితీరుపై ఆరా తీసిన సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలో డ్రగ్స్ అనే పదం వినిపించకూడదు అని ఆదేశించారు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే యువతపై డ్రగ్స్, మత్తు పదార్థాలు తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోకి గంజాయి, మాదక ద్రవ్యాలు.. ఇతర రాష్ట్రాలనుంచి, ప్రాంతాలనుంచి వస్తున్నాయని, వాటిని అరికట్టేందుకు సరిహద్దుల్లో నిఘా పెట్టాలన్నారు రేవంత్ రెడ్డి. అనుమానిత ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలన్నారు. డ్రగ్స్ సరఫరా చేయాలంటేనే భయపడేలా కఠినంగా వ్యవహరించాలన్నారు.
“ప్రభుత్వం మీ వెనక ఉంది, భయపడకండి, ఎలాంటి బడా బాబులు ఉన్నా ఉక్కుపాదం మోపండి” అని అధికారులకు భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి. డ్రగ్స్ అనే పేరు వినపడితేనే వాటితో సంబంధం ఉన్న వారు వణికిపోవాలన్నారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు రేవంత్ రెడ్డి. ఇటీవల బెంగళూరు శివారులో జరిగిన రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. టాలీవుడ్ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు ఆ పార్టీలో డ్రగ్స్ వినియోగించారని బెంగళూరు పోలీసులు ప్రకటించడంతో ఈ సమీక్షపై ఉత్కంఠ నెలకొంది.
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
This website uses cookies.