Bhu Bharathi : తెలంగాణలో భూ భారతి చట్టం అమలు.. దీని వల్ల ఉపయోగాలు ఇవే
ప్రధానాంశాలు:
Bhu Bharathi : తెలంగాణలో భూ భారతి చట్టం అమలు.. దీని వల్ల ఉపయోగాలు ఇవే
Bhu Bharathi : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూసంస్కరణల దిశగా కీలకమైన నిర్ణయం తీసుకుంది. నేటి (ఏప్రిల్ 14) నుంచి కొత్తగా రూపొందించిన భూ భారతి చట్టంను అమలు చేయనుంది. ఈ చట్టాన్ని ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డి భూభారతి పోర్టల్ ను అధికారికంగా ప్రారంభించనున్నారు. తొలిదశలో రాష్ట్రంలోని మూడు జిల్లాల్లోని మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా ఈ చట్టాన్ని అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. పోర్టల్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నారు.

Bhu Bharathi : తెలంగాణలో భూ భారతి చట్టం అమలు.. దీని వల్ల ఉపయోగాలు ఇవే
Bhu Bharathi భూ భారతి చట్టం అంటే ఏంటి.. దేనికి ఉపయోగం
ఈ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడానికి జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంచుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా భూ భారతి చట్టం అమలులోకి రానుంది. మరోవైపు, భూముల విషయంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలున్న ధరణి వ్యవస్థపై త్వరలోనే ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. భూక్షేత్రంలో పారదర్శకతను తీసుకురావడమే ఈ కొత్త చట్టం లక్ష్యంగా ఉంది.
ఇప్పటివరకు అమల్లో ఉన్న ఆర్వోఆర్-2020 చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టంలో భద్రత, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటు, వ్యక్తిగతంగా పట్టా ఉన్న భూముల రిజిస్ట్రేషన్‌ను నియంత్రించేలా నిబంధనలు రూపొందించారు. భూములపై అక్రమ హక్కులు పొందేందుకు చేసే ప్రయత్నాలను అడ్డుకునేలా ఈ చట్టం పనిచేస్తుందని అధికారులు పేర్కొన్నారు. కోదండరెడ్డి, మాజీ ఐఎఎస్ అధికారి రేమండ్ పీటర్, న్యాయవాది భూమి సునీల్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో రూపొందిన ఈ చట్టం ప్రజలకు ఎంత మేలు చేస్తుందని అంటున్నారు.