Congress : పదేళ్ల పాటు బీఆర్ఎస్ తెలంగాణలో పరిపాలన సాగించగా, వారి పరిపాలనకి విసుగు చెందిన ప్రజలు ఈ సారి కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. అయితే గత పది నెలలుగా సీఎం రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న పాలసీ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్మాణాత్మక వైఖరిని కాకుండా డైవర్షన్ పాలిటిక్స్‌ను నమ్ముకొని పాలన సాగిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక సమస్య వస్తే దానిని కప్పిపుచ్చేందుకు మరో సమస్యను సృష్టిస్తూ గందరగోళంలో ముంచుతున్నారనే విమర్శను ముఖ్యమంత్రి ఎదుర్కొంటున్నారు.
రీసెంట్ గా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమనే వాదన వినిపిస్తున్నది. నిజానికి మంత్రి సురేఖను సోషల్‌మీడియాలో ట్రోల్ చేయడాన్ని మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్ సహా పలువురు నేతలు ఖండించారు. అటువంటి వాటిని వ్యక్తిగతంగా, బీఆర్‌ఎస్ పార్టీ పరంగా ఖండిస్తున్నామని హరీశ్‌రావు స్పష్టంచేశారు. అయినా, కేటీఆర్ స్పందించలేదంటూ ఆయనతో పాటు అక్కినేని ఫ్యామిలీ, సమంతలపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇక మూసీ సుందరీకరణ, హైడ్రా కూల్చివేతలతో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చివరకు పలువులు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అసహనం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు ప్రజా వ్యతిరేకతపై నివేదికలు అందుకున్న అధిష్ఠానం.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుని మొట్టికాయలు వేసిందని గాంధీభవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. హైడ్రాతో ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ పెద్దల పర్యవేక్షణలో మొన్నటికి మొన్న ఒక ప్రముఖ హీరోయిన్ చేసిన కామెంట్ అంటూ ఒక కరపత్రాన్ని సోషల్ మీడియాలోకి వదిలారు. అది వైరల్ అయినా కావాల్సినంత మైలేజ్ రాలేదు. దీంతో ఈసారి ఏకంగా మహిళా మంత్రినే రంగంలోకి దించి, సినీ కుటుంబాల వ్యక్తిగత వ్యవహారాలను రాజకీయాల్లోకి లాగారనే చర్చ జరుగుతున్నది. డిసెంబర్ 7న కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన నాటినుంచి తాజాగా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల దాకా పది నెలలుగా సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. ‘హైడ్రా, మూసీ కూల్చివేతలపై దృష్టి మళ్లించడం కోసం ఒక మహిళా మంత్రి.. మరో స్టార్ హీరోయిన్ వ్యక్తిగత జీవితంపై నిరాధారమైన ఆరోపణలు చేసి చాలా తప్పు చేశారు.
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
Exit polls Maharashtra : బుధవారం జరిగిన మహారాష్ట్ర మరియు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో అనేక ఎగ్జిట్ పోల్స్ బిజెపి నేతృత్వంలోని…
Mohini Dey : స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ar rahman భార్య సైరా బాను Saira Banu…
This website uses cookies.