Home » News » Devotees Strange Wishes In The Hundis Of The Medaram Jatara
News

Medaram Jatara 2026 : మేడారం జాతర హుండీలో భక్తుడి వేదన .. వంద రూపాయల నోటుపై రాసిన గోడు వైరల్..!

Authored By
Suma
The Telugu News | Updated on: February 6, 2026 5:31 pm
Advertisement

Medaram Jatara 2026 : Asia Telangana ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా  Tribal jatara  పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర  Sammakka-Saralamma jatara  భక్తుల అపార విశ్వాసానికి ప్రతీక. కోట్లాదిమంది భక్తులు తమ కష్టసుఖాలు, కోరికలు, వేదనలతో అమ్మవార్లను ఆశ్రయిస్తుంటారు. జాతర ముగిసిన అనంతరం హుండీల లెక్కింపు సమయంలో వెలుగుచూసే మొక్కులు, లేఖలు, కానుకలు భక్తుల మనోభావాలను స్పష్టంగా చూపిస్తాయి. తాజాగా మేడారం హుండీలో లభించిన ఒక వంద రూపాయల నోటు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ నోటుపై రాసిన మాటలు చూసిన వారిని కదిలించేస్తున్నాయి.

Advertisement

Medaram Jatara 2026 : మేడారం జాతర హుండీలో భక్తుడి వేదన .. వంద రూపాయల నోటుపై రాసిన గోడు వైరల్..!

Medaram Jatara 2026 : వంద రూపాయల నోటుపై  ఆర్తనాదం

హుండీల లెక్కింపు సమయంలో అధికారులకు లభించిన ఆ వంద రూపాయల నోటుపై  One hundred rupee note “అమ్మ సమ్మక్క సారలమ్మ.. మా కొడుకు బాధ నుండి మమ్మల్ని రక్షించండి” అని రాసి ఉంది. ఈ ఒక్క వాక్యం వెనుక దాగి ఉన్న కుటుంబ వేదన నెటిజన్లను కలచివేస్తోంది. సాధారణంగా భక్తులు ఉద్యోగాలు, ప్రమోషన్లు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కోసం మొక్కులు చెల్లిస్తారు. కానీ ఇక్కడ ఒక భక్తుడు తన కుమారుడి వల్ల ఎదుర్కొంటున్న బాధను భరించలేక చివరకు దేవతలనే ఆశ్రయించడం సమాజాన్ని ఆలోచింపజేస్తోంది. వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కొడుకే కాలయముగా మారాడన్న భావన ఆ నోటులో స్పష్టంగా కనిపిస్తోంది. పోలీసులకు చెప్పుకోలేక బంధువులకు చెప్పలేక చివరకు అమ్మవార్ల ముందు తన గోడును ఇలా వెలిబుచ్చిన ఆ తల్లిదండ్రుల మనస్థితి ఎంత దయనీయమో అర్థమవుతోంది.

Advertisement

Medaram Jatara 2026 : హుండీల లెక్కింపులో వెలుగుచూస్తున్న కోరికలు

మేడారం జాతర హుండీల్లో నగదు, బంగారం, వెండి వస్తువులతో పాటు భక్తుల కోరికల లేఖలు పెద్ద సంఖ్యలో లభిస్తున్నాయి. ప్రేమ పెళ్లిళ్లు సఫలం కావాలని భూ వివాదాలు పరిష్కారమవ్వాలని, విదేశీ ఉద్యోగాలు రావాలని, ఉద్యోగాల రెగ్యులరైజేషన్ కావాలని కూడా భక్తులు లేఖల రూపంలో అమ్మవార్లకు విన్నవించారు. కొందరు తమ కోరికలు నెరవేరితే నిలువెత్తు బంగారం, మేకలను మొక్కులుగా చెల్లిస్తామని పేర్కొన్నారు. అయితే తాజాగా లభించిన ఈ వంద రూపాయల నోటు మాత్రం భక్తుల కోరికలకన్నా ఒక కుటుంబం అనుభవిస్తున్న క్షోభకు ప్రతిరూపంగా మారింది. ఈ ఘటన మారుతున్న సమాజంలో నైతిక విలువలు ఎంతగా దిగజారుతున్నాయో చూపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. హుండీలోని ఈ నోటును చూసిన అధికారులు కూడా క్షణం సేపు ఆశ్చర్యానికి లోనయ్యారని సమాచారం. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ కావడంతో ఆ తల్లిదండ్రులకు అమ్మవార్లు ధైర్యం ఉపశమనం ఇవ్వాలని అనేక మంది నెటిజన్లు ప్రార్థిస్తున్నారు. ఇది కేవలం ఒక వంద రూపాయల నోటు కాదు ఒక కుటుంబ వేదనకు నిశ్శబ్ద సాక్ష్యం.

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి