Home » News » Disruption In Water Supply In Hyderabad On 17th Which Areas
News

Hyderabad : హైదరాబాద్ 17న నీటి సరఫరాలో అంతరాయం.. ఏఏ ప్రాంతాల్లో అంటే..?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: February 16, 2025, 1:40 pm
Advertisement

Hyderabad : హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1 లోని కొండపాక పంపింగ్ స్టేషన్ వద్దనున్న 3000 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్ కు.. 900 ఎంఎం డయా వాల్వులు ( బీఎఫ్ అండ్ ఎన్ఆర్వీ HMWSSB ) అమర్చనున్నారు. ఈ పనులు తేది.17.02.2025, సోమవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు అనగా తేది.18.02.2025, మంగళవారం ఉదయం 6 గంటల వరకు కొనసాగుతాయి. కాబట్టి ఈ 24 గంటలు కింద పేర్కొన్న ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.

Advertisement

Hyderabad : హైదరాబాద్ 17న నీటి సరఫరాలో అంతరాయం.. ఏఏ ప్రాంతాల్లో అంటే..?

Hyderabad అంతరాయం కలిగే ప్రాంతాలు

1. ఓ అండ్ ఎం డివిజన్-6 : ఎస్.ఆర్.నగర్, సనత్ నగర్, బోరబండ, ఎస్పీఆర్ హిల్స్, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, వెంగళ్ రావు నగర్, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ, ఫతేనగర్.

Advertisement

2. ఓ అండ్ ఎం డివిజన్-9 : కూకట్ పల్లి, భాగ్యనగర్, వివేకానంద నగర్, ఎల్లమ్మబండ, మూసాపేట్, భరత్ నగర్, మోతీ నగర్, గాయత్రినగర్, బాబా నగర్, కేపీహెచ్ బీ, బాలాజీ నగర్, హస్మత్ పేట్.

3. ఓ అండ్ ఎం డివిజన్-12 : చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్ నగర్, గాజుల రామారం, సూరారం, ఆదర్శ్ నగర్, భగత్ సింగ్ నగర్, జగద్గిరిగుట్ట, ఉషోదయ.

Advertisement

4. ఓ అండ్ ఎం డివిజన్-13 : అల్వాల్, ఫాదర్ బాలయ్య నగర్, వెంకటాపురం, మచ్చబొల్లారం. డిఫెన్స్ కాలనీ, వాజ్ పేయ్ నగర్, యాప్రాల్, చాణిక్యపురి, గౌతమ్ నగర్, సాయినాథపురం.

5. ఓ అండ్ ఎం డివిజన్-14 : చెర్లపల్లి, సాయిబాబా నగర్, రాధికా.

6. ఓ అండ్ ఎం డివిజన్-15 : కొండాపూర్, డోయెన్స్, మాదాపూర్ (కొన్ని ప్రాంతాలు).

7. ఓ అండ్ ఎం డివిజన్-17 : హఫీజ్ పేట్, మియాపూర్.

Advertisement

8. ఓ అండ్ ఎం డివిజన్-21 : కొంపల్లి, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, జవహర్ నగర్, దమ్మాయిగూడ, నాగారం.

9. ఓ అండ్ ఎం డివిజన్-22 : నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్, గండి మైసమ్మ, తెల్లాపూర్, బొల్లారం.

10. ట్రాన్స్ మిషన్ డివిజన్-4 : ఎంఈఎస్, త్రిశూల్ లైన్స్, గన్ రాక్, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, బీబీనగర్ ఎయిమ్స్.

11. ఆర్ డబ్ల్యూఎస్ ఆఫ్ టేక్స్ ప్రాంతాలు : ప్రజ్ఞాపూర్ (గజ్వేల్), ఆలేర్ (భువనగిరి), ఘన్ పూర్ (మేడ్చల్/ శామీర్ పేట్).

Advertisement

కావున అంతరాయం ఏర్పడే ప్రాంతాల ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోగలరని కోరడమైనది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి