HCU భూమిని తెలంగాణ ప్రభుత్వం తీసుకునే అధికారం ఉందా…? ఎలా..?
ప్రధానాంశాలు:
HCU భూమిని తెలంగాణ ప్రభుత్వం తీసుకునే అధికారం ఉందా...? ఎలా..?
HCU : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ hyderabad central university (HCU) స్థాపన సమయంలో 1974లో కేంద్ర ప్రభుత్వం 2,300 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూమిని విద్యా మరియు పరిశోధన కార్యకలాపాలకు మాత్రమే ఉపయోగించాలనే ఉద్దేశంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూనివర్శిటీకి అప్పగించింది. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఈ భూమిలో 400 ఎకరాలను ప్రభుత్వ అభివృద్ధి ప్రాజెక్టులకు ఉపయోగించాలని నిర్ణయించింది. ఇది విద్యార్థులు, అధ్యాపకులు, పర్యావరణవేత్తల మధ్య నిరసనలకు దారితీసింది.

HCU భూమిని తెలంగాణ ప్రభుత్వం తీసుకునే అధికారం ఉందా…? ఎలా..?
తెలంగాణ ప్రభుత్వం ఈ భూమిని తీసుకునే అధికారం ఉందా అనే విషయాన్ని పరిశీలిస్తే.. ఇది ప్రభుత్వ నియంత్రణలో ఉన్న భూమి అయినప్పటికీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ కేంద్ర సంస్థగా గుర్తింపబడింది. ఈ కారణంగా, ఈ భూమి రాష్ట్ర ప్రభుత్వానికి అనుబంధమైనదా లేదా కేంద్ర ప్రభుత్వం నేరుగా నియంత్రించగలదా అనే అంశంపై చట్టపరమైన స్పష్టత అవసరం. ఇటీవల తెలంగాణ హైకోర్టు ఈ వివాదంపై తీర్పునిస్తూ, భూమి తెలంగాణ ప్రభుత్వ పరిధిలోనే ఉందని వెల్లడించింది. దీంతో ప్రభుత్వం దీన్ని వాణిజ్య, పారిశ్రామిక, లేదా ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు ఉపయోగించుకోవచ్చని న్యాయపరంగా బలమైన స్థానం సంపాదించింది.
అయితే యూనివర్శిటీకి అప్పగించిన భూమిని విద్యా ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించాలి అని విద్యార్థులు, అధ్యాపకులు వాదిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం దీనిని ప్రభుత్వ భూమిగా భావించి, బహుళ ప్రయోజనాల కోసం ఉపయోగించాలని భావిస్తుండగా, విద్యార్థులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనికి తోడు యూనివర్శిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న జీవ వైవిధ్యం కూడా ఈ భూవివాదానికి మరింత ఉదృతతను తెచ్చింది. ప్రభుత్వ వైఖరి ఒక వైపు, విద్యార్థుల నిరసనలు మరోవైపు కొనసాగుతుండటంతో, భవిష్యత్‌లో దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందో చూడాలి.