
Uttam Kumar Reddy : రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
Uttam Kumar Reddy : రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గురువారం జరిగిన కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో ఆయన మాట్లాడారు. నూతన కమిటీ సూర్యాపేట, మిర్యాలగూడ, ఖమ్మం, ఏపీలోని జగ్గయ్యపేట మార్కెట్‌ను సందర్శించి మార్కెట్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
Uttam Kumar Reddy : రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
కోదాడ మార్కెట్ అభివృద్ధికి తన వంతు సహకరిస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భవిష్యత్తులో గోదావరి జలాలు పాలేరు ద్వారా కోదాడకు తరలించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల వద్దకు పాలన తెచ్చి ప్రజల మధ్యే లబ్ధిదారులను పారదర్శకంగా గుర్తించేందుకు ప్రజా పాలన, గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జాబితాలో పేరు లేకపోతే ఆందోళన వద్దని పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసి సంవతృరంలో రూ.54 వేల కోట్ల లబ్ధి చేకూర్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం యాదాథ్రి భువనగిరి జిల్లా భువనగిరి మార్కెట్ కమిటీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలను సస్యశ్యామలం చేస్తున్న ఎమ్మెల్యేలు ఉండడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. ఈ రెండు నియోజకవర్గాలను అభివృద్ధి చేసే బాధ్యత తనదేనన్నారు. గత ప్రభుత్వం చేయని రుణమాఫీని సీఎం రేవంత్‌రెడ్డి తన భుజాలపై వేసుకుని ఏకకాలంలో రూ.21 వేల కోట్లు మాఫీ చేశామన్నారు. రైతులు పండించిన సన్న ధాన్యానికి రూ.110 కొట్ల బొనస్ అందచెసినట్లు తెలిపారు. అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్ నాయకులు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారన్నారని దుయ్యబట్టారు.
భువనగిరి, ఆలేరు ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కు మార్‌రెడ్డి, బీర్ల అయిలయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఆరు గ్యారంటీలను పకడ్బందీగా అమలు చేయ డంతో పాటు రూ.8 లక్షల రుణమాఫీ చేశామన్నారు. గత ప్రభుత్వంలో రుణమాఫీ చేస్తే వడ్డీ కిందికే పోయేదన్నారు. భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ కనుకుంట్ల రేఖ బాబురావు, వైస్ చైర్మన్ బైస్ రాజేశ్ ఫైలెట్, డైరెక్టర్లతో జిల్లా మార్కెటింగ్ అధికారి సబిత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, ఎండీ. అవేస్ చిస్తీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తంగెళ్లపల్లి రవికుమార్, బర్రె జహంగిర్, గొళ పంగల్‌రెడ్డి, తడక వెంకటెశి, కూర వెంకటెశ్, ఎలిమినెట్ కృష్ణారెడ్డి, పి. శ్యాంగౌడ్, ఆర్డీవో ఎం. కృష్ణారెడ్డి, జడ్పీ సీఈవో ఎన్. శోభా రాణి, డీఏవో గోపాల్ పాల్తొన్నారు.
రైతులు, చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను నూరు శాతం అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. యాదాద్రిభవనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో వలిగొండ వ్యవసాయ మార్కెట్ కేంద్ర కార్యాలయం, రామన్నపేట నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు పండించిన థాన్యానికి మూడు రోజుల్లో వారి ఖాతాలో డబ్బులు జమ చేసినట్లు తెలిపారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.