Categories: NewsTelangana

Future City Hyderabad : హైదరాబాద్‌లోని మూడు కీలక నగరాల తర్వాత నాల్గవ నగరంగా ఫ్యూచర్ సిటీ.. అస‌లేంటీ ఫ్యూచ‌ర్ సిటీ.. మ‌రో భూ కుంభ‌కోణ‌మా ?

Advertisement
Advertisement

Future City Hyderabad : తెలంగాణ‌ రాష్ట్ర రాజ‌ధాని త్వ‌ర‌లో నాల్గొవ న‌గ‌రాన్ని క‌లిగి ఉండ‌నుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని అధికార కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఈ న‌గ‌రానికి “ఫ్యూచర్ సిటీ” గా నామ‌క‌ర‌ణం చేసింది. మిగ‌తా మూడు న‌గ‌రాలు హైదరాబాద్, సికింద్రాబాద్ మరియు సైబరాబాద్. హైదరాబాద్ ప్రధాన నగరం నుండి దక్షిణం వైపు 50 కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లాలోని ముచ్చెర్ల వద్ద వస్తున్న “ఫ్యూచర్ సిటీ” తదుపరి తరం యొక్క భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అల్ట్రామోడర్న్ రీజియన్‌గా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించబడింది. “మేము ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాము, ఇది భవిష్యత్తుకు భారతదేశానికి సమాధానం అవుతుంది. ఇది భారతదేశపు మొదటి నికర జీరో కార్బన్ సిటీ అవుతుంది. ఫ్యూచర్ సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ టూరిజం, స్పోర్ట్స్, సాఫ్ట్‌వేర్ మరియు ఫార్మాకు హబ్‌గా మారుతుంది. ఇది రెండవ రౌండ్ గోల్డ్ రష్ లాంటిది, ”అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజల భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి హైదరాబాద్ పరిధులను మరింత విస్తరించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.

Advertisement

అయితే ఈ ఫోర్త్‌సిటీపై అందరిలోనూ ఆసక్తి నెలకొన్నా.. మరోవైపు దీనిని పెద్ద ఎత్తున రియల్‌ ఎస్టేట్‌ దందా కోసమే తెరపైకి తెచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరు, ముచ్చర్ల, తుక్కుగూడ నుంచి యాచారం వరకు భూములు చేతులు మారుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడి భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. దీనివెనుక పెద్ద దందా నడుస్తున్నదని, ఫార్మాసిటీకి కేటాయించిన భూములను బలవంతంగా లాక్కొని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేందుకే కాంగ్రెస్‌ నాయకులు ఫోర్త్‌సిటీ పాటపాడుతున్నారని బీఆర్‌ఎస్ నాయ‌కులు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో చేసిన రీజినల్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ను ప్రస్తుత ప్రభుత్వం మార్చడం కూడా ఇందులో భాగమేనని ఆరోపిస్తున్నది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దాదాపు 14 వేల ఎకరాల భూమిని సేకరించి ఫార్మాసిటీ ఏర్పాటుకు సన్నద్దమైంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే దాన్ని రద్దు చేసి అదే భూములను ఆసరా చేసుకొని ఫ్యూచర్‌ సిటీని తలపెట్టింది. కొత్త ప్రాజెక్టులను ఇక్కడే ఏర్పాటు చేయాలని తలచింది. స్కిల్‌ యూనివర్సిటీ, స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, ఏఐ సిటీని ఈ ప్రాంతానికే తరలిస్తున్నది. అంతర్జాతీయ కంపెనీలకు కూడా ఇక్కడి భూములనే కేటాయిస్తున్నది.

Advertisement

Future City Hyderabad : హైదరాబాద్‌లోని మూడు కీలక నగరాల తర్వాత నాల్గవ నగరంగా ఫ్యూచర్ సిటీ.. అస‌లేంటీ ఫ్యూచ‌ర్ సిటీ.. మ‌రో భూ కుంభ‌కోణ‌మా ?

ఆక్యుపెన్సీ లేదని కారణాలు చూపుతూ రాయదుర్గం ఎయిర్‌పోర్టు మెట్రోను రద్దు చేసి, ఫోర్త్‌ సిటీ వైపు మాత్రం మెట్రో రైలును తీసుకెళ్లే పనిలో పడింది. 300 ఫీట్ల గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్లు నిర్మిస్తున్నది. ఇక్కడ వసతులు లేకున్నా కొన్ని కంపెనీలు వందలాది ఎకరాలు కొనుగోలు చేశాయి. కందుకూరు నుంచి యాచారం దాక అసైన్డ్ భూములు కూడా కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు గతంలో తమ ప్రభుత్వం ప్రతిపాదించిన భూమిని ఇతర అవసరాలకు ఎలా వాడుకుంటారని బీఆర్‌ఎస్‌ ప్రశ్నిస్తున్నది. ఫార్మాసిటీ కోసం సేకరించిన 14 వేల ఎకరాల భూమి కండిషనల్‌ ల్యాండ్‌ ఆక్విజేషన్‌ అని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఫార్మాసిటీ కోసం మాత్రమే తీసుకుంటున్నామన్నది స్పష్టంగా జీవోలోనే పేర్కొన్నట్టు చెప్పారు. ఆ భూముల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేయకుంటే వాటిని తిరిగి రైతులకు అప్పగించాలని లేదంటే వాటిలో ఫార్మాసిటీని మాత్రమే నిర్మించాలని డిమాండ్‌ చేశారు. ఫార్మాసిటీ కోసం సేకరించిన వేల ఎకరాల భూమిని రియల్‌ ఎస్టేట్‌ దందాల కోసం, ఫ్యూచర్‌ సిటీ, ఫోర్త్‌ సిటీ కోసం మళ్లించి వేల కోట్లు కొల్లకొట్టాలని కాంగ్రెస్‌ పెద్దలు కుట్ర చేసున్నట్టు ఆరోపించారు.

Advertisement

Recent Posts

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ 8 ఎలిమినేట్ కానున్న స్ట్రాంగ్ కంటెస్టెంట్..?

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది…

60 mins ago

Ration Cards : 15 లక్షల రేషన్ కార్డులను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం ?

Ration Cards : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 15 లక్షల రేషన్ కార్డులను రద్దు…

2 hours ago

Prakash Raj : ప్రకాష్ రాజ్ vs పవన్ కళ్యాణ్ : సోష‌ల్ మీడియా వేదిక‌గా కొన‌సాగుతున్న వార్‌..!

Prakash Raj : గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై నటుడు ప్రకాష్ రాజ్…

3 hours ago

Devara Movie Public Talk : దేవర పబ్లిక్ టాక్, బ్లాక్ బస్టర్ అనిపించుకోవాలంటే ఎంత వసూళ్లు రాబట్టాలో తెలుసా..?

Devara Movie Public Talk : ఎన్ టీ ఆర్ దేవర ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా…

5 hours ago

Allu Arjun : అవునా.. అక్క‌డ అల్లు అర్జున్ కన్నా రామ్ కే క్రేజ్ ఎక్కువా..?

Allu Arjun : బాలీవుడ్ లో అల్లు అర్జున్ కన్నా రామ్ కే క్రేజ్ ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. అదేంటి…

6 hours ago

Tirumala : తిరుమల డిక్లరేషన్ అంటే ఏమిటి.. టీటీడీ నిబంధనలు ఏం చెబుతున్నాయి…!

Tirumala : ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటన రాజ‌కీయంగా హీట్ పెంచింది. జ‌గ‌న్‌ శ్రీవారి దర్శనానికి…

7 hours ago

Ys Jagan : తిరుమల పర్యటనకు జగన్.. డిక్లరేషన్‌పై సంతకం చేయాలని విప‌క్షాల‌ డిమాండ్

Ys Jagan : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో…

7 hours ago

Aloe Vera : కలబందతో చర్మ సమస్యలకు ఈజీగా చెక్ పెట్టొచ్చు తెలుసా…!

Aloe Vera : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా తమ ముఖం మెరుస్తూ మంచి నిగారింపుతో ఉండాలి అని…

9 hours ago

This website uses cookies.