Gruha Jyothi Scheme : అన్ని అర్హతలు ఉన్నప్పటికీ జీరో కరెంట్ బిల్ పొందలేకపోతున్నారా… అయితే ఈ శుభవార్త మీకోసం…!

Gruha Jyothi Scheme : ఎన్నికల సమయంలో భాగంగా ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ముందుకు సాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలలో గృహజ్యోతి పథకం కూడా ఒకటి. అయితే ఈ పథకం ద్వారా అర్హులైన అందరికీ 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకం అమలు చేయడం జరిగింది.

తద్వారా చాలామంది 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందగలుగుతున్నారు. కానీ ప్రస్తుతం కొన్నిచోట్ల అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తమకు లబ్ధి చేకూరడం లేదని ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. అలాంటి వారికి ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా శుభవార్త చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 200 యూనిట్ల లోపు విద్యుత్ ను ఏ కుటుంబం వాడుకున్న వారికి జీరో బిల్లు ఇస్తామని తెలియజేశారు. అలాగే అన్ని అర్హతలు కలిగి ఉన్న గతంలో ఈ పథకానికి అప్లై చేసుకోకపోతే ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. దీనికోసం గ్రామీణ ప్రాంత ప్రజలు మండల కార్యాలయాలను సంప్రదించాలని , పట్టణ ప్రాంత ప్రజలైతే డివిజన్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇక ఈ ప్రక్రియ నిరంతరం సాగుతుందని ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేశారు.

Gruha Jyothi Scheme : అన్ని అర్హతలు ఉన్నప్పటికీ జీరో కరెంట్ బిల్ పొందలేకపోతున్నారా… అయితే ఈ శుభవార్త మీకోసం…!

అలాగే గృహజ్యోతి పథకానికి అర్హులను గవర్నమెంట్ సెలెక్ట్ చేయలేదని గ్రామ సభలను ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించామని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. అలా అందుకున్న దరఖాస్తులను పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసి అన్ని అర్హతలు కలిగిన వారికి ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఇప్పటివరకు ఈ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 46 లక్షలకు పైగా కుటుంబాలను అర్హులుగా గుర్తించినట్లు చెప్పుకొచ్చారు. అలాగే 2024 – 25 ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రకారం గృహజ్యోతి పథకం కోసం దాదాపు రూ.2,418 కోట్లను కేటాయించినట్లుగా బట్టి పేర్కొన్నారు. కావున ఎవరు చింతించాల్సిన అవసరం లేదని అన్ని అర్హతలు కలిగి ఉన్నవారు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

Recent Posts

Dil Raju : త‌ర్వాతి ప్రాజెక్ట్స్‌పై దిల్ రాజు క్లారిటీ.. గ‌ట్టి ప్రాజెక్ట్స్ సెట్ చేశాడుగా..!

Dil Raju : ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌న తమ్ముడు జూలై 4న విడుద‌ల కానుంది. ఈ మూవీ…

1 hour ago

Jio Recharge : జియో వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లు .. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 12 నెలలు ఫ్రీ

Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…

2 hours ago

Komatireddy Venkat Reddy : హరీష్ , కేటీఆర్ నా స్థాయి కాదు.. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి..! వీడియో

Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

3 hours ago

Chandrababu : బనకచర్ల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదు : చంద్రబాబు

Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…

3 hours ago

Prices : ఆ వ‌స్తువుల ధ‌ర‌లు ఇక మ‌రింత చౌక‌.. జీఎస్టీ స్లాబ్‌లలో భారీ మార్పులు ?

Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…

4 hours ago

Fish Venkat : ఫిష్ వెంక‌ట్‌కి ఇలాంటి ప‌రిస్థితి రావ‌డానికి కార‌ణం అదేనా?

Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…

5 hours ago

Ys Jagan : బాబు అడ్డాపై జగన్ ఫోకస్..!

Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…

6 hours ago

Former MLCs : ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్సీ ల బాధలు అన్నీఇన్నీ కావు..!

Former MLCs  : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…

7 hours ago