Good News : కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలను ఇస్తామని హామీ ఇచ్చారు.అందులో ఒకటి గృహ జ్యోతి పథకం. 200 యూనిట్ల లోపు బిల్లును ప్రభుత్వం కడుతుందని ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ గృహ జ్యోతి పథకం ప్రకారం 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ అంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఊదరగొట్టారు.ఇవాళ ఒకటో తారీకు మరో రెండు మూడు రోజులలో బిల్లులు ఇంటికి వస్తాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం కరెంట్ బిల్లు కట్టాలా వద్దా అనేది ప్రజలలో సందేహం కలుగుతుంది. కాంగ్రెస్ నాయకులు చెప్పిన దాని ప్రకారం బిల్లు కట్టకూడదు. అలా అని బిల్ కట్టకపోతే కట్ చేసేస్తారు. ప్రభుత్వం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు సామాన్యులు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు తమకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుందని అనుకున్నారు.
కానీ అనుకున్నది ఒక్కటి అయిందొకటి అన్నట్టుగా నేడు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. కరెంటు బిల్లులు కట్టొద్దంటూ గతంలో చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు. 200 యూనిట్ల లోపు ఫ్రీ అన్నవారు కానరాకుండా పోయారు. ఇప్పుడు ఆ విషయం గురించి ఎక్కడ మాట్లాడటం లేదు. గృహజ్యోతి పథకం అంటూ గొప్పగా ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నంతగా దాన్ని మార్చింది. తమ ప్రభుత్వం రావటం వలన అన్ని సమస్యలు తీరిపోతాయని ప్రచారం చేసుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ముఖం చాటేసుకుంటున్నారు. కరెంటు కోతలతో ఒకపక్క రైతులు, ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా అందని కరెంటు తిప్పలతో పేషెంట్లు మరోపక్క ఉన్నారు. ఈ క్రమంలో అసలు ఫ్రీ కరెంటు ఉంటుందా..ఇస్తారా..ఇవ్వరా.. సందిగ్ధత ఏర్పడింది.
ఇక గత ప్రభుత్వం బీఆర్ఎస్ విద్యుత్ రంగంపై అప్పులు చేసిందంటూ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కరెంటు బిల్లులు కట్టొద్దు అంటూ ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు సైలెంట్ గా అప్పుల పేరుతో పక్కకు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు గృహజ్యోతి పథకం నిబంధన ఎక్కడ ప్రకటించలేదు. అసలు ఈ పథకాన్ని అమలు చేస్తారా లేక ఎగ్గొడతారా అని అనుమానాలు కలుగుతున్నాయి. అలాగే పింఛనుదారులకు గతంలో 2016 రూపాయలు వచ్చేవి. అయితే కాంగ్రెస్ ఈ డబ్బులను 4000 చేస్తామంటూ ప్రచారం చేసింది. దీనితో చాలామంది కాంగ్రెస్ హామీలకు ఆకర్షితులయ్యారు. ఇప్పుడు ఓటేసిన వారికి మొండి చేయి చూపించింది హస్తం గుర్తు పార్టీ. పాత డబ్బులనే వాళ్ళకి ఇచ్చింది. దీంతో వృద్ధులు ఇతర పింఛన్ దారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.