Indiramma Housing Scheme : గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇండ్ల పధకానికి సంబదించిన రెండో లిస్ట్ వచ్చేస్తుంది..!
ప్రధానాంశాలు:
Indiramma Housing Scheme : గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇండ్ల పధకానికి సంబదించిన రెండో లిస్ట్ వచ్చేస్తుంది..!
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేద కుటుంబాలకు ఆవాసం కల్పించాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే గ్రామాల వారీగా లబ్ధిదారుల దరఖాస్తులు స్వీకరించిన అధికారులు, అర్హుల జాబితా తయారీలో నిమగ్నమయ్యారు. తొలి విడతలో 72 వేల మందిని ఎంపిక చేసిన ప్రభుత్వం, ఇప్పుడు రెండో విడత జాబితాను ఈ నెలాఖరులోగా విడుదల చేయేందుకు కార్యాచరణ వేగవంతం చేసింది.

Indiramma Housing Scheme : గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇండ్ల పధకానికి సంబదించిన రెండో లిస్ట్ వచ్చేస్తుంది..!
Indiramma Housing Scheme ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్..
రెండో విడత ఎంపిక ప్రక్రియలో నియోజకవర్గానికి సగటున 3,500 ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందువల్ల ప్రతి గ్రామంలో అర్హుల ఎంపిక జరగనుంది. ఈ ఎంపిక ప్రక్రియలో స్థానిక ఎమ్మెల్యేల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. మొత్తం రెండు విడతల కలిపి 4.5 లక్షల మంది లబ్ధిదారులతో జాబితాను సిద్ధం చేయాలని లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు. ఎంపిక ప్రక్రియలో ఏవైనా లోపాలు లేకుండా పూర్తిస్థాయి క్షేత్ర స్థాయి పరిశీలన చేపడుతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు జూన్ తర్వాత జరగే అవకాశముండటంతో, ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే కనీసం పునాది నిర్మాణం, పిల్లర్లు పూర్తి చేసి లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే మొదటి విడతలో ఎంపికైన 72 వేల మందిలో 42 వేల మందికి ఇండ్ల మంజూరు పత్రాలు జారీ చేసినట్లు సమాచారం. మిగిలిన 30 వేల మంది విషయమై మళ్లీ పరిశీలన కొనసాగుతోంది. రెండో విడత జాబితాలో పూర్తిగా న్యాయమైన, అర్హులైన లబ్ధిదారులనే ఎంపిక చేసేందుకు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.