Telangana : తెలంగాణ మంత్రివర్గం ఫిక్స్ అయినట్లేనా..? మినిస్టర్ పదవి పోయే నేత ఎవ‌రు.. వ‌చ్చే నేత ఎవ‌రు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Telangana : తెలంగాణ మంత్రివర్గం ఫిక్స్ అయినట్లేనా..? మినిస్టర్ పదవి పోయే నేత ఎవ‌రు.. వ‌చ్చే నేత ఎవ‌రు..?

 Authored By ramu | The Telugu News | Updated on :17 May 2025,8:14 pm

ప్రధానాంశాలు:

  •  తెలంగాణ మంత్రివర్గం ఫిక్స్ అయినట్లేనా..? మినిస్టర్ పదవి పోయే నేత ఎవ‌రు.. వ‌చ్చే నేత ఎవ‌రు..?

Telangana  : తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అవ్వడం తో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలనలో ఒక సంవత్సరం పూర్తికావడాన్ని పురస్కరించుకుని, మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. ఇప్పటివరకు పలువురి పేర్లు ప్రచారంలో ఉండగా, పార్టీలోని సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు, విభిన్న వర్గాల నచ్చిన నేతలకు ప్రాధాన్యత ఇచ్చే దిశగా అధిష్ఠానం చర్చలు జరిపింది. తాజా సమాచారం ప్రకారం.. కొత్తగా ఇద్దరికి అవకాశం కల్పించనున్నారట. ఇక ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఒకరిని తప్పించే అవకాశమూ ఉందని వార్తలు వస్తున్నాయి.

Telangana తెలంగాణ మంత్రివర్గం ఫిక్స్ అయినట్లేనా మినిస్టర్ పదవి పోయే నేత ఎవ‌రు వ‌చ్చే నేత ఎవ‌రు

Telangana : తెలంగాణ మంత్రివర్గం ఫిక్స్ అయినట్లేనా..? మినిస్టర్ పదవి పోయే నేత ఎవ‌రు.. వ‌చ్చే నేత ఎవ‌రు..?

మంత్రివర్గ విస్తరణపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఈ నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ జరగనుందని ఆయన స్పష్టం చేశారు. విస్తరణలో జాప్యం కారణాలను వివిధ సామాజిక సమీకరణలతో ముడిపెట్టారు. కొందరు తప్పుడు ప్రచారాలతో అసత్యాలను వ్యాపింపజేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 26, 27 తేదీల్లో కార్యవర్గానికి రూపురేఖలు ఖరారవుతాయని నేతలు తెలిపారు.

అలాగే మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కూడా అపార్థం చేసుకుని వివాదంగా మలిచారని పేర్కొన్నారు. మంత్రివర్గంలో మంత్రులందరూ సమ్మిళితంగానే పనిచేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినవారిపై సైబర్ క్రైమ్‌లో కేసులు పెడతామని హెచ్చరించారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గ ప్రవేశంపై రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో, ఆయనతో పాటు వివేక్‌కు పార్టీలో చేరే సమయంలో హామీ ఇచ్చిన విషయాన్ని నేతలు గుర్తు చేశారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది