Telangana : తెలంగాణ మంత్రివర్గం ఫిక్స్ అయినట్లేనా..? మినిస్టర్ పదవి పోయే నేత ఎవరు.. వచ్చే నేత ఎవరు..?
Telangana : తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అవ్వడం తో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలనలో ఒక సంవత్సరం పూర్తికావడాన్ని పురస్కరించుకుని, మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. ఇప్పటివరకు పలువురి పేర్లు ప్రచారంలో ఉండగా, పార్టీలోని సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు, విభిన్న వర్గాల నచ్చిన నేతలకు ప్రాధాన్యత ఇచ్చే దిశగా అధిష్ఠానం చర్చలు జరిపింది. తాజా సమాచారం ప్రకారం.. కొత్తగా ఇద్దరికి అవకాశం కల్పించనున్నారట. ఇక ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఒకరిని తప్పించే అవకాశమూ ఉందని వార్తలు వస్తున్నాయి.
Telangana : తెలంగాణ మంత్రివర్గం ఫిక్స్ అయినట్లేనా..? మినిస్టర్ పదవి పోయే నేత ఎవరు.. వచ్చే నేత ఎవరు..?
మంత్రివర్గ విస్తరణపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఈ నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ జరగనుందని ఆయన స్పష్టం చేశారు. విస్తరణలో జాప్యం కారణాలను వివిధ సామాజిక సమీకరణలతో ముడిపెట్టారు. కొందరు తప్పుడు ప్రచారాలతో అసత్యాలను వ్యాపింపజేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 26, 27 తేదీల్లో కార్యవర్గానికి రూపురేఖలు ఖరారవుతాయని నేతలు తెలిపారు.
అలాగే మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కూడా అపార్థం చేసుకుని వివాదంగా మలిచారని పేర్కొన్నారు. మంత్రివర్గంలో మంత్రులందరూ సమ్మిళితంగానే పనిచేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినవారిపై సైబర్ క్రైమ్‌లో కేసులు పెడతామని హెచ్చరించారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గ ప్రవేశంపై రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో, ఆయనతో పాటు వివేక్‌కు పార్టీలో చేరే సమయంలో హామీ ఇచ్చిన విషయాన్ని నేతలు గుర్తు చేశారు.
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
This website uses cookies.