Kavitha New Party : కవిత కొత్త పార్టీ పేరు అదేనా..?
Kavitha New Party : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికర వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖ లీకవ్వడం పార్టీ లోపల తీవ్ర గందరగోళానికి దారి తీసింది. ఈ లేఖపై పార్టీ ముఖ్య నేతలు స్పందించకపోవడం, కేటీఆర్ పరోక్ష వ్యాఖ్యలు చేయడం, కవిత మాత్రం వరుసగా తన మద్దతుదారులతో సమావేశాలు జరుపుతూ తన భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. తనకు ప్రాధాన్యత కల్పించాలని, భవిష్యత్ కార్యపధం స్పష్టతనిచ్చేయాలని డిమాండ్ చేస్తూ కేసీఆర్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు.

Kavitha New Party : కవిత కొత్త పార్టీ పేరు అదేనా..?
Kavitha New Party : T-BRS పేరుతో కవిత కొత్త పార్టీ..?
కవిత ప్రధానంగా రెండు విషయాలపై పట్టుబడుతున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకటి పార్టీలో తన ప్రాధాన్యత, రెండోది తన లేఖ లీకైన వ్యవహారం. ఆమె లేఖను కావాలనే లీక్ చేశారని, అది పార్టీ అంతర్గత కోవర్టుల పనిగా భావిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో కేసీఆర్ స్పందనపై ఆధారపడి తన రాజకీయ భవిష్యత్తు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అవసరమైతే బీఆర్ఎస్‌ను వీడేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని ఆమె సమీప వర్గాలు చెబుతున్నాయి. గతంలోనూ పార్టీకి సమర్పణ చూపినప్పటికీ సరైన గుర్తింపు రాకపోవడం ఆమెను బాధించినట్టు చెబుతున్నారు.
కవిత కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పార్టీ పేర్లపై చర్చలు ప్రారంభమయ్యాయన్న ప్రచారం జరుగుతోంది. “తెలంగాణ జాగృతి” పేరునే రాజకీయ పార్టీగా మార్చే అవకాశాలున్నాయని, లేకపోతే “తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి (T-BRS)” అనే పేరును బీసీ నేతల సూచనతో పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. రానున్న వారం రోజుల్లో కవిత కీలక ప్రకటన చేయవచ్చని, ఇది తెలంగాణ రాజకీయ దిశను పూర్తిగా మార్చేలా ఉంటుందన్న ఉహాగానాలు ఊపందుకున్నాయి. ఈ పరిణామాలు బీఆర్ఎస్‌కు గట్టి సవాలుగా మారే అవకాశం కనిపిస్తోంది.