Jana Reddy : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా సాగబోతుంది. అధికార పార్టీ టీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానం అవ్వడంతో ఆపార్టీ తీవ్రంగా గెలిచేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పటికే పార్టీ ప్రచారంను మొదలు పెట్టి పెద్ద ఎత్తున సభలు సమావేశాలు నిర్వహించింది. ఇక దుబ్బాక మరియు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచి మంచి ఊపు మీదున్న బీజేపీ సాగర్ లో కమలం జెండా ఎగుర వేయాలని ఉవ్విల్లూరుతుంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సాగర్ ను గెలిచి తీరుతాం అంటూ నమ్మకంగా ఉంది. వారి నమ్మకంకు కారణం జానా రెడ్డి. గత ఎన్నికల్లో ఆ స్థానం నుండి జానా రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడి పోయాడు. దాంతో ఆయన ఈసారి గెలవడం ఖాయం అంటూ రాజకీయ వర్గాల వారు కూడా నమ్మకంగా చెబుతున్నారు.
జానారెడ్డి వల్ల నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కనుక గెలిస్తే ఖచ్చితంగా ఆ పార్టీకి మంచి బూస్ట్ లభించినట్లే. ఎందుకంటే గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రతి చోట కూడా బొక్క బోర్లా పడుతూ వస్తున్న నేపథ్యంలో రెండవ స్థానం కోసం ఇప్పికే బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ తీవ్రంగా కృషి చేస్తుంది. వారికి వరుస విజయాలు నమోదు అవుతున్న నేపథ్యంలో ప్రజల్లో కూడా వారి పట్ల నమ్మకం కలుగుతుంది. గెలిచే వారినే జనాలు కావాలనుకుంటున్నారు. ఓడిపోతుంటే మా ఓటు వృదా అవ్వడం ఎందుకు అన్నట్లుగా గెలిచే వారిని గెలిపించేందుకు ఓటు వేస్తారు. కనుక సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ముందు ముందు ఆ పార్టీకి ప్లస్ అవుతుంది.
సాగర్ ఉప ఎన్నికల్లో జానా రెడ్డి పోటీ చేయడం దాదాపుగా ఖాయం అయ్యింది. ఉప ఎన్నిక అనగానే మండలంకు గ్రామంకు అన్నట్లుగా పార్టీ సమన్వయ కార్యకర్తలను కేటాయిస్తుంది. రాష్ట్ర స్థాయి నాయకులు కూడా మండల స్థాయిలో పార్టీ వ్యవహారాలు చూసుకునేందుకు ఎంపిక చేయబడుతాడు. కాని ఈసారి సాగర్ లో ఆ పద్దతి వద్దని జానా రెడ్డి అంటున్నాడు. బయట నుండి ఏ ఒక్కరిని కూడా తన నియోజక వర్గంలో పర్యవేక్షకులుగా నియమించవద్దని కోరాడు. ప్రతి మండలంలో కూడా తనకు నమ్మకం అయిన వారిని నియమించి వారిని తన కొడుకు రఘువీర్ రెడ్డి తో సమన్వయం చేస్తున్నాడు. అలా గెలుపు కోసం జానారెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. పార్టీ అధినాయకత్వం మాత్రం జానా మొండిగా ముందుకు వెళ్తున్నాడని కేసీఆర్ ను ఆయన ఢీ కొట్టగలడా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.