Categories: Newspolitics

బిగ్ బ్రేకింగ్‌ : తెలుగు సీఎంలు భేటీ.. అసలు విషయం ఏంటో తెలుసా?

ys jagan mohan reddy : ఏపీకి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేసిందనే విషయం చిన్న వారి నుండి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరు బలంగా వాదిస్తున్నారు. ప్రత్యేక హోదా నుండి మొదలుకుని మొన్నటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వరకు ఏపీకి ఏ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుండి సానుకూల నిర్ణయం రావడం అనేది జరుగలేదు. అందుకే బీజేపీ నాయకులను ఇరుకున పెట్టే విధంగా అధికార పార్టీ వైకాపా ప్రయత్నాలు చేస్తోంది. మరో వైపు తెలంగాణలో బీజేపీ పాగా వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రం నుండి రావాల్సిన నిధులు ఇవ్వక పోగా అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీని పదే పదే ఇబ్బందులకు గురి చేస్తుంది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ మరియు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఇద్దరు కూడా కేంద్రంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.

ys jagan mohan reddy : ఇన్నాళ్లు బీజేపీతో రాజీ ప్రయత్నం..

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ఇన్నాళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నించాడు. కాని జగన్‌ మోహన్‌ రెడ్డి ని బీజేపీ నాయకులు ముఖ్యంగా అధినాయకత్వం చేరనివ్వలేదు. తనకు తానుగా బీజేపీ నాయకులను కలిసి సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పలు సందర్బాల్లో మద్దతు పలికిన సందర్బాలు ఉన్నాయి. పలు బిల్లుల విషయంలో రాజ్య సభలో మద్దతుగా నిలిచిన వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి పై బీజేపీ అధినాయకత్వం ఏ విషయంలో కూడా కనికరం చూపించలేదు. రాష్ట్రంలో వైఎస్‌ జగన్ ప్రతిష్టను మసక పర్చే విధంగానే బీజేపీ నిర్ణయాలు తీసుకుంది. ఎన్నో విధాలుగా బీజేపీకి దగ్గర అయ్యే ప్రయత్నం చేసినా కూడా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విషయంలో వారు దూరం జరిగేందుకు ప్రయత్నించినట్లుగా అనిపించింది.

ys jagan mohan reddy and kcr meeting very soon

KCR : బీజేపీతో పోరాటంకు తెలుగు సీఎంలు సిద్దం..

వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డితో పాటు కేసీఆర్ కూడా బీజేపీతో దగ్గర అయ్యేందుకు ప్రయత్నించినా కూడా ప్రయోజనం లేదు. అందుకే కేంద్రంలో ఉన్న ఆ పార్టీ పై యుద్దం ప్రకటించేందుకు అన్నట్లుగా త్వరలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి మరియు కేసీఆర్ లు భేటీ అవ్వబోతున్నారు. వీరిద్దరు రెండు రాష్ట్రాలకు సంబంధించిన విభజన సమస్యలను పరిష్కరించేందుకు కూడా కలువబోతున్నట్లుగా చెబుతున్నారు. వీరిద్దరి భేటీతో బీజేపీ కి నష్టం చేకూరుతుందా అంటే ఏమీ లేదు. కాని భవిష్యత్తులో వీరిద్దరి కలయిక కేంద్రంలో ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి త్వరలోనే హైదరాబాద్‌ లో కేసీఆర్ తో భేటీ అవ్వడం ఖాయంగా చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

4 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago