Indiramma Houses : జవహర్‌నగర్ ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి.. వజ్రేష్ యాదవ్ డిమాండ్!
Jawahar Nagar Indiramma Indlu : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ గ్రామకంఠం పరిధిలోని 330 ఎకరాల్లో నివసిస్తున్న అర్హులైన పేద కుటుంబాలందరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వర్తింపజేయాలని డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ కోరారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ మను చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసి జవహర్‌నగర్, చంద్రపురి కాలనీ డివిజన్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇళ్ల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
Indiramma Houses : జవహర్‌నగర్ ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి.. వజ్రేష్ యాదవ్ డిమాండ్!
పాత పట్టాలు, విద్యుత్ బిల్లులు ఉన్న కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి
జవహర్‌నగర్ గ్రామకంఠం పరిధిలోని 330 ఎకరాల్లో ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న కుటుంబాల సమస్యలను పరిష్కరించాలని వజ్రేష్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. గతంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసిన దేవేందర్ గౌడ్ హయాంలో జారీ చేసిన పట్టాలు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ అందించిన తెలంగాణ పట్టాలు ఉన్న కుటుంబాల వివరాలను కలెక్టర్‌కు వివరించారు.అలాగే ఇంటి డోర్ నంబర్లు, విద్యుత్ బిల్లులు వంటి నివాస ఆధారాలు కలిగిన పేద కుటుంబాలను పరిశీలించి, అర్హత కలిగిన వారందరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రయోజనం కల్పించాలని కోరారు.
Also Read : Gold Rate Today : 21 నవంబర్ 2026 బంగారం కొనాలనుకునేవారికి బంపర్ ఛాన్స్.. వెండి ధర కూడా భారీగా తగ్గింది.!
ఇంటి నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలి.. కలెక్టర్‌కు వజ్రేష్ యాదవ్ విజ్ఞప్తి
గ్రామకంఠం పరిధిలో నివసిస్తున్న ప్రజలు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మున్సిపల్ అనుమతులు పొందేలా చర్యలు తీసుకోవాలని వజ్రేష్ యాదవ్ కోరారు. ఎన్నో సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్న పేద కుటుంబాలకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు సమస్యను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని ఇతర ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులు, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కలెక్టర్‌తో చర్చించారు. పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.జవహర్‌నగర్ గ్రామకంఠం నివాసుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో అర్హులైన కుటుంబాలకు ఇళ్ల మంజూరు, నిర్మాణ అనుమతుల అంశాలపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
